NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

మంకీపాక్స్ .. మ‌రో మ‌హ‌మ్మారినా ?

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : అమెరికాలో, యూరప్ లో చిన్నగా మొదలైన మంకీపాక్స్‌ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. ఆదివారం నాటికి 12 దేశాల్లో 180కి పైగా నిర్ధారిత, అనుమానిత కేసులను గుర్తించినట్టు వెల్లడించింది. ముఖ్యంగా యూర్‌పలోని 9 దేశాల్లో 100కు పైగా కేసులున్నట్టు పేర్కొంది. యూర్‌పలోని జర్మనీ, స్పెయిన్‌, ఫ్రాన్స్‌, బెల్జియం, ఇటలీ, నెదర్లాండ్స్‌, పోర్చుగల్‌, స్వీడన్‌, యునైటెడ్‌ కింగ్‌డమ్‌ దేశాల్లో మంకీపాక్స్‌ కేసులు నమోదయ్యాయి. అటు అమెరికా, కెనడా, ఆస్ట్రేలియాల్లోనూ మంకీ పాక్స్‌ కేసులు వచ్చాయి. ఇక, ఇజ్రాయెల్‌లో మంకీపాక్స్‌తో బాధపడుతున్న వ్యక్తి ఇటీవలే పశ్చిమ యూరప్‌ నుంచి తిరిగి వచ్చినట్టు వైద్యులు వెల్లడించారు. మంకీపాక్స్‌ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో భారత ప్రభుత్వం అప్రమత్తమైంది.

                                     

About Author