ప్రపంచ పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీగా మంకీపాక్స్ !
1 min readపల్లెవెలుగువెబ్ : పశ్చిమ ఆఫ్రికాలో వెలుగు చూసి ఇతర దేశాల్లో వేగంగా వ్యాపిస్తున్న మంకీపాక్స్‌ను ప్రపంచ ప్రజారోగ్య అత్యయిక స్థితిగా ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. ఆ మహమ్మారి ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా 75 దేశాలకు విస్తరించిందని, 16 వేల మందికి వ్యాధి సోకిందని డబ్ల్యూహెచ్‌వో చీఫ్ టెడ్రోస్ అథనోమ్ వెల్లడించారు. ఇప్పటి వరకు 5 మరణాలు సంభవించాయని, నిపుణుల కమిటీ సూచన మేరకు ఈ నిర్ణయం తీసుకున్న ట్లు వివరించారు. స్వలింగ సంపర్కుల్లో ఈ వ్యాధి ఎక్కువగా వస్తోందని తెలిపారు.