మంకీపాక్స్ .. ఎవరికైనా సోకచ్చు !
1 min readపల్లెవెలుగువెబ్ : మంకీపాక్స్ ముప్పుపై మరోసారి ప్రపంచ దేశాలను అప్రమత్తం చేస్తోంది ప్రపంచ ఆరోగ్య సంస్థ. వైరస్ వ్యాప్తి నెమ్మదిగానే ఉన్నా.. తక్కువ కేసులు నమోదు అవుతున్నా జాగ్రత్తలు మాత్రం పాటించాలని కోరింది. ఈ క్రమంలో త్వరలో జరగాల్సిన ఎల్జీబీటీక్యూ పరేడ్‌లను అడ్డుకోవాలని కొందరు పిలుపు ఇస్తుండగా.. ఆ అవసరం లేదని డబ్ల్యూహెచ్‌వో కీలక ప్రకటన చేసింది. అయితే కేవలం స్వలింపసంపర్కులతోనే మంకీపాక్స్ వైరస్ వ్యాప్తి చెందుతుందన్న వాదనను వైద్యనిపుణులు కొట్టిపారేస్తున్నారు. వైరస్ ఎవరికైనా సోకుతుందని మరోసారి స్పష్టం చేసింది డబ్ల్యూహెచ్‌వో. వైరస్ సోకిన ఎవరి నుంచైనా సరే.. ఇన్‌ఫెక్షన్ మరొకరికి సోకుతుంది. కాబట్టి, ఎల్జీబీటీక్యూ ప్రైడ్ పరేడ్‌లను నిరభ్యరంతంగా నిర్వహించుకోవచ్చు, అది వాళ్ల హక్కు కూడా అని డబ్ల్యూహెచ్‌వో విభాగం ప్రకటన చేసింది.