ఇండియాలో మంకీపాక్స్ .. కేంద్రం ఏం చెప్పింది ?
1 min readపల్లెవెలుగువెబ్ : ఇండియాలో ఇప్పటికైతే ఒక్క మంకీపాక్స్ కేసు కూడా నమోదు కాలేదని కేంద్ర వైద్య శాఖ అధికారులు ప్రకటించారు. మంకీపాక్స్ ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తి చెందుతున్న క్రమంలో పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నట్లు తెలిపారు. భారత్‌లో మంకీపాక్స్ కేసులు నమోదు కానంత మాత్రాన పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని నిర్లక్ష్యంగా వ్యవహరించడం మంచిది కాదని సైంటిస్ట్ ప్రగ్యా యాదవ్ చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకూ దాదాపు 20 దేశాల్లో మంకీపాక్స్ కేసులు నమోదయ్యాయినట్లు డబ్ల్యూహెచ్వో పేర్కొంది. సుమారు 200 మంకీపాక్స్ కేసులు నమోదయినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది.