PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మంకీపాక్స్ బాధితుడి మృతి.. కేంద్రం కీల‌క నిర్ణ‌యం !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ప్రపంచవ్యాప్తంగా ప్రబలుతూ భయాందోళనకు గురిచేస్తున్న మంకీపాక్స్ కట్టడి కోసం కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. దీనిపై నిఘా పెట్టేందుకు ప్రత్యేక టాస్క్ ఫోర్స్‌ను ఏర్పాటు చేసినట్లు అధికార వర్గాలు తెలిపాయి. దేశవ్యాప్తంగా మంకీపాక్స్ పరిస్థితిని పర్యవేక్షించడమే గాక, ఈ మహమ్మారిని నియంత్రించేందుకు చేపట్టాల్సిన చర్యలపై ఈ టాస్క్‌ఫోర్స్‌ ప్రభుత్వానికి దిశా నిర్దేశం చేయనుంది. అలాగే దేశవ్యాప్తంగా మంకీపాక్స్ పరీక్షా కేంద్రాలను విస్తరించడం, వ్యాక్సినేషన్ వంటి విషయాలపై సూచనలు ఇవ్వనుంది. యూఏఈ నుంచి కేరళ వచ్చిన 22 ఏళ్ల యువకుడు మంకీపాక్స్ అనుమానిత లక్షణాలతో శనివారం మృతి చెందాడు. దేశంలో ఇప్పటివరకు నాలుగు మంకీపాక్స్ కేసులు నమోదయ్యాయి. వారిలో ఒకరు ఇప్పటికే కోలుకున్నారు. అయితే ఈ వ్యాధి దేశవ్యాప్తంగా విస్తరించకుండా పటిష్ట చర్యలు చేపట్టాలని కేంద్రం భావిస్తోంది.

                                         

About Author