భారత్ లో ప్రవేశించిన రుతుపవనాలు.. సీమకు భారీ వర్ష సూచన !
1 min readపల్లెవెలుగువెబ్ : నైరుతి రుతుపవనాలు దేశంలోకి ప్రవేశించాయి. దక్షిణ బంగాళాఖాతం, అండమాన్ దీవులకు పూర్తిగా విస్తరించాయి. దీంతో ఏపీలో పలుచోట్ల వానలు కురిసే అవకాశం ఉంది. కర్నూలు, కడప, తిరుపతిలో భారీ వర్షం కురిసే అవకాశం ఉంది. తెలంగాణలో రాగల మూడు రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది. వచ్చే 24 గంటల్లో తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తాయి.