NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

రాక్షసుడు .. సీక్వెల్​

1 min read

సినిమా డెస్క్​ : గత కొద్ది రోజులుగా హిట్‌ సినిమాలకి సీక్వెల్స్‌ను తెరకెక్కిస్తున్నారు చాలామంది మేకర్స్. ఇప్పుడు ‘రాక్షసుడు’ దర్శకనిర్మాతలు దీని సీక్వెల్‌ ‘రాక్షసుడు 2’ తెరకెక్కిస్తున్నామని అధికారికంగా ప్రకటించారు. ఫస్ట్‌ వచ్చిన సైకలాజికల్‌ థ్రిల్లర్‌‌లో హీరో బెల్లంకొండ శ్రీనివాస్‌ నటించాడు. రమేష్ వర్మ డైరెక్షన్‌లో తెరకెక్కింది. అనుపమ పరమేశ్వరన్‌ హీరోయిన్‌గా నటించింది. సినిమా బ్లాక్‌ బస్టర్‌‌ అయింది. అయితే ఈ మూవీకి సీక్వెల్ రానుందని గత కొద్ది రోజులుగా వార్తలు వస్తున్నాయి. అవి నిజమంటూ నిన్న ‘రాక్షసుడు2’ చిత్రాన్ని అనౌన్స్‌ చేస్తూ టైటిల్‌ని, కాన్సెప్ట్‌ పోస్టర్‌‌ని రిలీజ్ చేశారు. వేటలు వేసే పెద్ద కత్తి ఒకటి రక్తం ఓడుతూ ఓ చైన్‌కి వేలాడుతోంది.. దూరంగా ఓ సైకో చేతితో గొడ్డలి పట్టకుని, భుజంపై మూటకట్టి ఉన్న డెడ్‌బాడీని మోసుకెళ్తున్నాడు. పోస్టరే ఇంత భయపెడుతుంటే ఇంక సినిమా ఎలా ఉంటుందో అన్న ఆశక్తి కలుగుతోంది. ఈసారి మరింత థ్రిల్ ఖాయమనిపిస్తోంది కూడా. త్వరలోనే షూట్ స్టార్ట్ చేయనున్నట్టు కూడా పోస్టర్‌‌పై ఉంది. దీనికి దర్శకుడు రమేష్ వర్మ. అయితే హీరో ఎవరన్నది మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. ఓ స్టార్ హీరో పేరు త్వరలోనే చెబుతామంటూ సస్పెన్స్ క్రియేట్ చేసి ఊరిస్తున్నారు. హీరో ఎవరో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే మరి. ఈ చిత్రాన్ని కోనేరు సత్యనారాయణ నిర్మిస్తున్నారు. జిబ్రాన్ సంగీతం అందిస్తున్నాడు.

About Author