ఇంకెంత మంది బలవ్వాలి !
1 min read
పల్లెవెలుగువెబ్ : ముఖ్యమంత్రి జగన్ పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ‘‘మీలో చలనం రావాలంటే ఇంకెంత మంది ఆడబిడ్డలు బలవ్వాలి జగన్ రెడ్డి గారు?. విజయనగరం జిల్లాలో అర్థరాత్రి ఘోరం జరిగినా మీ మనస్సు కరగదా?. పైగా మహిళా హోంమంత్రి వనిత అత్యాచారాలు కొన్ని అలా జరుగుతూ ఉంటాయ్ అని మాట్లాడటం అన్యాయం. విజయనగరంలో హెడ్ కానిస్టేబుల్ కొడుకు చెర్రీ స్నేహితులతో కలిసి వివాహితపై అమానవీయంగా దాడి చేసి పిల్లల ఎదుటే అత్యాచారానికి పాల్పడ్డటం దారుణం. మహిళలు బయటకి రావాలంటేనే భయపడే పరిస్థితి రాష్ట్రంలో నెలకొన్న నేపథ్యంలో మహిళల భద్రత కోసం ప్రత్యేక చర్యలు తీసుకోవాలి’’ అని లోకేష్ డిమాండ్ చేశారు.