PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఆరోగ్య శ్రీ కార్డుల పంపిణీలో మరింత పురోగతి సాధించాలి

1 min read

జిల్లా కలెక్టర్ డా.జి.సృజన

పల్లెవెలుగు వెబ్ కర్నూలు: ఆరోగ్య శ్రీ కార్డుల పంపిణీలో మరింత పురోగతి సాధించాలని అన్ని మండలాల ఎంపీడీవోలను జిల్లా కలెక్టర్ డా.జి.సృజన టెలి కాన్ఫరెన్స్ ద్వారా అదేశించారు. గురువారం ఉదయం  ఇళ్ల పట్టాల రిజిస్ట్రేషన్, ఆరోగ్య శ్రీ కార్డుల పంపిణీ, ఫార్మ్స్ డిస్పోజల్ అంశాలపై మండల స్పెషల్ ఆఫీసర్లు , మునిసిపల్ కమిషనర్ లు,తహశీల్దార్లు, ఎంపిడిఓ లతో  జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.సృజన టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆరోగ్య శ్రీ కార్డుల పంపిణీ కి సంబంధించి ఇప్పటివరకు లక్ష 56 వేల కార్డులు పంపిణీ చేయడం జరిగిందన్నారు. కొన్ని మండలాల్లో కార్డుల పంపిణీ బాగా జరిగిందని,  నందవరం, మంత్రాలయం, కోసిగి, ఆస్పరి, హలహర్వి, ఆదోని అర్బన్, గోనెగండ్ల  తదితర మండలాల్లో మాత్రం  కేవలం 10 నుండి 15 శాతమే పంపిణీ చేశారని, పంపిణీ చేయడంలో పురోగతి తీసుకొని రావాలని సంబంధిత మండలాల ఎంపీడివోలను కలెక్టర్ ఆదేశించారు.   ఆరోగ్యశ్రీ కార్డులు పంపిణీ చేసే సమయంలో ఏఎన్ఎంలు హాజరయ్యే విధంగా తగిన చర్యలు తీసుకోవాలని డిఎంహెచ్వోను కలెక్టర్ ఆదేశించారు . నవరత్నాలు పేదలందరికీ ఇళ్లు పథకం ఇళ్ళ పట్టాలకు సంబంధించి  పెండింగ్ లో ఉన్న డాక్యుమెంట్ లను కూడా ఈరోజు పంపిణీ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని సంబంధిత డివిజనల్ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఎన్నికలకు సంబంధించి ఎన్నికల విధులలో ఎవరినైతే నియమించారో వారు ప్రసూతి, వైద్య, మంజూరైన సెలవులలో ఉంటే వారిని మినహాయించి, అనధికారికంగా  దీర్ఘకాలిక  సెలవుల్లో ఉన్న వారిని వెంటనే విధులలో చేరే విధంగా తగిన చర్యలు తీసుకోవాలని, అందుకు సంబంధించి సర్క్యులర్ కూడా హెచ్ఓడి లకు పంపడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. ఫార్మ్స్ కు  సంబంధించి  నిన్న  6 వేల దరఖాస్తులు డిస్పోజ్ చేయడం జరిగిందన్నారు. 7 రోజుల గడువు దాటిన దరఖాస్తులను  ఈరోజు లోపు డిస్పోస్ చేసే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఫార్మ్ 7 కి సంబంధించి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి నుండి అనుమతి వచ్చిన వాటిని మాత్రమే డిస్పోస్ చేయాలని కలెక్టర్ రిటర్నింగ్ అధికారులను ఆదేశించారు. కొన్ని పోలింగ్ కేంద్రాలలో కనీస మౌలిక సదుపాయాలకు సంబంధించి పత్రికలలో ప్రచురితమైన ప్రతికూల వార్తలు ప్రచురితమయ్యాయని,  వాటిని తనిఖీ చేసి సదుపాయాలు లేని వాటికి కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని నోడల్ అధికారులకు, రిటర్నింగ్ అధికారులకు కలెక్టర్ సూచించారు. గడప గడపకు మన ప్రభుత్వం కి సంబంధించి టెక్నికల్, అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ అయిన 1357 పనులు ఇంకా మొదలు పెట్టలేదని సిపిఓ కలెక్టర్ దృష్టికి తీసుకొని రాగా ఏ మండలాలలో పనులు మొదలు పెట్టలేదో సంబంధిత డేటాను జిల్లా పరిషత్ సిఈఓ కు పంపించే విధంగా చర్యలు తీసుకోవాలని సిపిఓ ను కలెక్టర్ ఆదేశించారు.జాయింట్ కలెక్టర్ నారపురెడ్డి మౌర్య మాట్లాడుతూ నవరత్నాలు పేదలందరికీ ఇళ్లు పథకం ఇళ్ళ పట్టాలకు సంబంధించి 34 వేల డాక్యుమెంట్లకు గాను  ఇప్పటివరకు 14,420 డాక్యుమెంట్లు పంపిణీ చేయడం జరిగిందన్నారు.  10 వేల డాక్యుమెంట్లు ప్రింటింగ్ లో ఆలస్యం జరిగి నిన్న  సాయంత్రం వచ్చాయన్నారు..6 వేల డాక్యుమెంట్ లు కూడా ఈరోజు సాయంత్రానికి వస్తాయని మిగిలిన డాక్యుమెంట్లు కూడా డౌన్లోడ్ చేసి ప్రింటింగ్ కి పంపించడం జరిగిందని కలెక్టర్ కి వివరించారు.టెలి కాన్ఫరెన్స్ లో మునిసిపల్ కమిషనర్ భార్గవ్ తేజ, ఆదోని సబ్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ, కర్నూలు ఆర్డీఓ శేషి రెడ్డి,  పత్తికొండ ఆర్డీఓ రామలక్ష్మి, జడ్పీ సీఈవో నాసర రెడ్డి, డి ఎం హెచ్ ఓ రామగిడ్డయ్య, ఆరోగ్యశ్రీ కోఆర్డినేటర్ భాస్కర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

About Author