గ్రామాభివృద్ధికి 20 లక్షలకు పైగా ఖర్చు
1 min readపల్లెవెలుగు, వెబ్ మిడుతూరు: ఆయన సున్నిపెంటలోని ప్రాజెక్టు ఆసుపత్రిలో ప్రభుత్వ ఉద్యోగిగా పని చేస్తూ 2012 వ సంవత్సరంలో పదవీ విరమణ అయ్యారు. తర్వాత ఆయన ఇంటి దగ్గరే ఉంటూ గ్రామంలో ఉన్న ప్రజలకు సేవ చేయాలనే లక్ష్యంతో 2020వ సంవత్సరం ఏప్రిల్ నెలలో జరిగిన పంచాయతీ ఎన్నికలలో ఆ గ్రామం ఎస్సీ రిజర్వేషన్ కావడంతో ఆయన పంచాయతీ ఎన్నికలలో పోటీ చేసి ప్రజల మన్నలతో గెలుపొందారు. వయసులో ఎంత చిన్న వారైనా పెద్దవారైనా అన్న,అక్క అంటూ 70 ఏళ్ళు వృద్ధాప్యంలో ఉన్నా సరే మంచి పలకరింపులతో పలకరిస్తూ ప్రజల దీవెనలు పొందుతున్నారు.ఆయన ఏగ్రామ సర్పంచ్ అని అనుకుంటున్నారా.. మిడుతూరు మండల పరిధిలోని కడుమూరు గ్రామానికి చెందిన సర్పంచ్ సందె పోగు జీవరత్నం.ఈయన సర్పంచుగా అయిన తర్వాత గ్రామంలో సంవత్సరంన్నరలో నుంచి చేపట్టిన అభివృద్ధి పనులు ఈవిధంగా ఉన్నాయి.జగనన్న కాలనీలో రెండు బోర్లు వేశామని,ఉర్దూ పాఠశాల దగ్గర కొత్తగా బోరును వేయించి ఇక్కడ నుంచి జగనన్న కాలనీకి 12 లక్షలతో జగనన్న కాలనీకి పైపులను వేశామన్నారు.గ్రామంలో జగనన్న కాలనీలో 122 గృహాలు మంజూరు కాగా 115 మంది గృహాలు ప్రారంభించారని ఈగృహాలు అన్నీ కూడా వివిధ దశలలో ఉన్నాయని అన్నారు.అంతే కాకుండా గృహాలలో మండలంలోనే ఈ గ్రామం మొదటి స్థానంలో ఉందని గతంలోనే అధికారులు తెలియజేశారు.బీసీ కాలనీలో ఉన్న డ్రైనేజీ కాలువను ఏడు లక్షలతో మరియు ఉర్దూ పాఠశాల దగ్గర ఉన్న డ్రైనేజీ సమస్య తీవ్రంగా ఉండడం పట్ల గ్రామ సర్పంచ్ దీనిని దృష్టిలో పెట్టుకొని పాఠశాల దగ్గర నాలుగు సిమెంట్ రింగ్ పైపులు వేయించి మురికి నీళ్లు సక్రమంగా వెళ్లే విధంగా కృషి చేశారు.పైపాలెం దారిలో(బీసీ కాలనీ)లో బోరు వేయించి 12 హెచ్పి మోటార్ తో నీళ్లను అందిస్తున్నారు.80 వేల రూపాయలతో ఎస్డబ్ల్యు పిసి షెడ్ మరమ్మతులు చేయించారు.దళిత కాలనీ సామేలు ఇంటి నుంచి మెయిన్ రహదారి పుల్లయ్య ఇంటి వరకు 60 వేలతో పైపులు వేయించారు.గ్రామంలో ఓహెచ్ఎస్ ఆర్ త్రాగునిటీ ట్యాంకులు మూడు ఉండగా వాటిని ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తూ ట్యాంకులలో బ్లీచింగ్ పౌడర్ వేయిస్తున్నామన్నారు.అదేవిధంగా గ్రీన్ అంబాసిడర్లతో గ్రామంలో ఎక్కడ కూడా చెత్తాచెదారం లేకుండా గ్రామాన్ని శుభ్రంగా ఉంచుతున్నామని,గ్రామపంచాయతీ కార్యదర్శి బి.శివకళ్యాణ్ సింగ్ మరియు గ్రీన్ అంబాసిడర్ల సహకారంతో గ్రామంలో ఎప్పటికప్పుడు శానిటేషన్ చేస్తున్నామన్నారు.తర్వాత గ్రామంలో ఉన్న త్రాగునీటి మోటార్లు మరమ్మతులు అయిన వెంటనే వాటిని రిపేర్ చేయించి గ్రామ ప్రజలకు ఎలాంటి త్రాగునీటి అసౌకర్యం కలగకుండా వెంటనే రిపేర్లు చేయిస్తున్నామని ఇంతవరకు 20 లక్షలకు పైగా గ్రామ అభివృద్ధి కొరకు ఖర్చు చేశానని ఈబిల్లులు అంతా కూడా త్వరగా వచ్చినట్లయితే గ్రామ అభివృద్ధికి ఇంకా పాటు పడతానని పల్లెవెలుగు దినపత్రిక ముఖాముఖిలో భాగంగా గ్రామ సర్పంచ్ ఎస్.జీవరత్నం మాట్లాడారు.