PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

రుణం కోసం భూములు తాకట్టు పెట్టడం దారుణం

1 min read

పల్లెవెలుగువెబ్ : రుణం కోసం 480 ఏకరాల అమరావతి భూములును తనఖా పెట్టడం దారుణమని బీజేపీ నేత లంకా దినకర్ అన్నారు. సీఆర్డీఏ చట్టం పునరుద్ధరణ భూముల ద్వారా అప్పులు తెచ్చేది… రైతులను తిప్పలు పెట్టడానికేనా? అని ప్రశ్నించారు. సీఆర్డీఏ చట్టం ప్రకారం రుణాల నిధులు పక్కకు మల్లించే అధికారం ఎవరికీ లేదన్నారు. ఉద్యోగులు పెన్ డౌన్ సమయంలో రాజధాని భూముల తనఖా రిజిస్ట్రేషన్ కోసం పెన్ ఎలా కదిలిందని నిలదీశారు. ప్రస్తుతం మార్కెట్ విలువ ప్రకారం ఎకరా ధర రూ.7 కోట్లు అని ప్రభుత్వం చూపుతున్నప్పుడు, ఆ లెక్క ప్రకారం పరిహారం ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందా అని అడిగారు. రుణాలు ఎలా తీసుకొని, దశలవారీగా దేనికి ఎలా ఖర్చు చేయాలో సీఆర్డీఏ చట్టంలో స్పష్టంగా ఉందని… దాన్ని అతిక్రమించి రుణాలు మంజూరు చేయకూడదని డిమాండ్ చేశారు.

           

About Author