NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

అత్యధిక క‌రోన మ‌ర‌ణాలు వీరిలోనే …

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్: క‌రోన వ్యాక్సిన్ ప్రపంచ వ్యాప్తంగా అందుబాటులోకి వ‌చ్చింది. అయిన‌ప్పటికీ క‌రోన మ‌ర‌ణాలు త‌గ్గడంలేదు. అమెరికాలో భారీ ఎత్తున వ్యాక్సిన్ పంపిణీ జ‌రిగింది. కానీ క‌రోన మ‌ర‌ణాలు తగ్గలేదు. క‌రోన బారినప‌డి మ‌ర‌ణిస్తున్నవారిలో 99 శాతం మంది వ్యాక్సిన్ తీసుకోనివారేన‌ని ప్రముఖ అంటువ్యాధుల నిపుణులు ఆంటోని ఫౌచి అన్నారు. ఈ మ‌ర‌ణాలు నివారించ‌గ‌లిగేవేన‌ని ఆయ‌న తెలిపారు. మ‌హమ్మారిని ఎదుర్కోగ‌ల సాధ‌నం మ‌న చేతుల్లో ఉన్నప్పటికి… దానిని అంద‌రూ తీసుకోక‌పోవ‌డం విచార‌క‌ర‌మ‌ని ఫౌచి అన్నారు. అమెరికాలో అవ‌స‌ర‌మైన వ్యాక్సిన్ లు ఉన్నప్పటికీ.. వ్యాక్సిన్ తీసుకోవ‌డానికి ప్రజ‌లు ముందుకు రాక‌పోవ‌డం విచార‌క‌ర‌మ‌ని ఆవేద‌న వ్యక్తం చేశారు. వ్యాక్సిన్ల ప‌ట్ల కొంద‌రికి వ్యతిరేక భావ‌న ఉంద‌ని, దానిని ప‌క్కకు పెట్టాల‌ని ఫౌచి కోరారు.

About Author