PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మోస్ట్‌ హ్యాండ్సమ్‌ మ్యాన్‌..

1 min read

సినిమా డెస్క్​ : ప్యాన్‌ ఇండియా స్టార్‌‌గా ఎదిగిన రెబల్‌ స్టార్‌‌ ప్రభాస్‌ కీర్తి దశ దిశలా విస్తరిస్తోంది. అటు సినిమాలతోపాటు ఇటు పర్సనల్ విషయాల్లోనూ సత్తా చాటుతున్నాడు. లేటెస్ట్ గా ప్రభాస్ అందుకున్న రికార్డు చూస్తే స్టిల్‌ బ్యాచిలర్ అయిన ప్రభాస్‌ రేంజ్ లో ఉన్నాడో అర్థమైపోతుంది. స్టార్ డమ్ విషయంలోనే కాదు.. యువతుల మనసు దోచుకోవడంలోనూ ప్రభాస్ ఎవరెస్టుపై ఉన్నాడనిపిస్తోంది. ‘టాప్ టెన్ మోస్ట్ హ్యాండ్సమ్ ఏషియన్ మెన్ – 2021’ జాబితాలో ఏకంగా నెంబర్ వన్ ప్లేస్ సాధించాడు ప్రభాస్‌. అంటే.. ఏసియాలోనే రెబల్ స్టార్ ప్రభాస్ ను మించిన అందగాడు లేడని ఆ సర్వే చెబుతోంది. బాహుబలితో పాన్ ఇండియా స్టార్ గా మారిపోయిన ప్రభాస్.. ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇప్పటి వరకూ ఇలాంటి సర్వేలు అంటే.. బాలీవుడ్ హీరోలు మాత్రమే రేసులో నిలిచేవారు. కానీ.. వారందరినీ పక్కకు నెట్టి ప్రభాస్ మొదటి స్థానంలో నిలవడంతో ఫ్యాన్స్ ఆనందాన్ని అవధుల్లేకుండా పోతున్నాయి. ఇప్పటి వరకు ఈ ఫీట్ సాధించిన మొదటి ఇండియన్ హీరో ప్రభాస్ మాత్రమే కావడం గమనార్హం. దీంతో.. సోషల్ మీడియాలో ప్రభాస్ ఫ్యాన్స్ రచ్చ చేస్తున్నారు.

About Author