NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఒకేసారి త‌ల్లీకొడుకుల‌కు ఉద్యోగం వ‌చ్చింది !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ఒకేసారి తల్లీకొడుకులకు ఉద్యోగం వ‌చ్చింది. కేరళలో ఈ సంఘటన జరిగింది. మలప్పురమ్‌కు చెందిన బిందు అనే మహిళ, ఆమె కుమారుడు ఒకేసారి ప్రభుత్వ ఉద్యోగం సాధించారు. బిందు తన కుమారుడు 10వ తరగతి చదువుతున్న సమయంలో అతడిని ప్రోత్సహించేందుకు పుస్తకాలు చదవటం ప్రారంభించారు. అదే ఆమెను కేరళ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌(పీఎస్‌సీ) పరీక్షలవైపు మళ్లించింది. తొమ్మిదేళ్ల తర్వాత కుమారుడితో పాటు ఉద్యోగం సాధించారు. 42 ఏళ్ల బిందు.. లాస్ట్‌ గ్రేడ్‌ సర్వెంట్‌(ఎల్‌జీఎస్‌) పరీక్షలో 92వ ర్యాంకు సాధించారు. 24 ఏళ్ల ఆమె కుమారుడు లోవర్‌ డివిజనల్‌ క్లర్క్‌(ఎల్‌డీసీ) పరీక్షలో 38వ ర్యాంక్‌ సాధించాడు. ఈ విషయాన్ని ఓ టీవీ ఇంటర్వ్యూలో వెల్లడించారు బిందు.

                                       

About Author