సృష్టిలో తల్లి ప్రేమ గొప్పది..
1 min read– ఆబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీ V శ్రీనివాస్ గౌడ్
పల్లెవెలుగు వెబ్, మహబూబ్నగర్ : సృష్టిలో తల్లి ప్రేమ ఎంతో గొప్పది… స్వచ్ఛమైనదన్నారు ఆబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీ V శ్రీనివాస్ గౌడ్. అంతర్జాతీయ మాతృ దినోత్సవం సందర్భంగా ఆదివారం మాతృమూర్తులకు శుభాకాంక్షలు తెలిపారు. తల్లి నుండి ఓర్పు, సహనం, ప్రేమ, త్యాగం వంటి ఎన్నోసుగుణాలను మనం నేర్చుకుంటామన్నారు. మహిళలు, మాతృమూర్తుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయన్నారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆయన తల్లికి పాదాభివందనం చేశారు.