తమలపాకుల చీర అలంకరణతో శ్రీశ్రీశ్రీ అచ్చమ్మ పేరంటాలమ్మ తల్లి
1 min read
పెద్ద ఎత్తున తరలివస్తున్న భక్తులు
చలువ పందిళ్ళలో సేదతీరుతున్న భక్తులు, అసౌకర్యాలు కలవకుండా ప్రత్యేక పర్యవేక్షణ
పల్లెవెలుగు వెబ్ ఏలూరుజిల్లా ప్రతినిధి: గాలాయగూడెం గ్రామంలోని శ్రీశ్రీశ్రీ అచ్చమ్మ పేరంటాలు తల్లి అమ్మవారి 68వ వార్షికోత్సవాల 7వ రోజు అమ్మవారు తమలపాకుల చీరతో ప్రత్యేక అలంకరణ లో భక్తులకు దర్శనమిస్తున్నారు. 7వ రోజు సందర్భంగా,ఈ రోజు రాత్రి 9 గంటలకుఅపూర్వమైన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగినది. కావున నేడు కూడా మీరు మీ కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి అమ్మవారి ఉత్సవాలలో పాల్గొనిఆస్వాదించన్నరు.అమ్మవారి ఆశీర్వచనములు తీసుకోవలసిందిగా కోరుతున్నామన్నరు. వివిధ ప్రాంతాల నుండి వేలాదిగా ఉత్సవాలకు విచ్చేస్తున్న భక్తులకు ఉత్సవాలకు సహాయ సహకారాలు అందిస్తున్న దాతలకు మా గాలయగూడెం గ్రామము తరపున మరియు అచ్చమ్మ పేరంటాల తల్లి ఆలయ కమిటీ తరఫున హృదయపూర్వక ప్రత్యేక ధన్యవాదములు తెలిపారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ప్రత్యేక పర్యవేక్షణలో కమిటీ సభ్యులు పనిచేస్తున్నారు.