పరమ పవిత్ర పతివ్రతా మూర్తి సీతామాత…
1 min read
మాళిగి పావని విశ్వ హిందూ పరిషత్ జిల్లా మాతృశక్తి కో- కన్వీనర్……
కర్నూలు, న్యూస్ నేడు: విశ్వహిందూ పరిషత్ మాతృశక్తి ఆధ్వర్యంలో ఈరోజు ఉదయం 11 గం.లకు ఉల్చాల వై రోడ్డు జంక్షన్ వధ్ధ గల వాసవి నగర్ లో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో “సీతానవమి” సందర్భంగా సీతారాముల పూజ కార్యక్రమం విశ్వహిందూ పరిషత్ జిల్లా సహా సత్సంగ కన్వీనర్ కృష్ణ పరమాత్మ ఆధ్వర్యంలో నిర్వహించారు అనంతరం ముఖ్య వక్తగా విచ్చేసిన విశ్వహిందూ పరిషత్ మాతృశక్తి జిల్లా కో కన్వీనర్ పావని మాట్లాడుతూ…మహర్షి వాల్మీకి రచించి నభారతీయ జీవన గ్రంథం శ్రీమద్రామాయణం ఆ రామాయణంలో సామాన్య మానవ జీవనం ఆదర్శవంతంగా ఎలా ఉండాలో నేర్పించినదనీ, భార్యాభర్తల అనుబంధం ఎలా ఉండాలో సుస్పష్టంగా రామాయణ మహాగ్రంధం తెలియజేసిందని అన్నారు. మహా పతివ్రత అయిన సీత తన జీవితాన్ని మొత్తం శ్రీరామునికే అంకితం చేసిందని చిన్నప్పుడే అప్రతిహత శక్తిమంతురాలై శివధనస్సును వంటి చేత్తో కదిలించిన ఆమె అంతే అణుకువతో శ్రీరాముని భార్యగా జీవనాన్ని కొనసాగించింది. 14 సంవత్సరాలు వనవాసం అనుభవించడానికి సిద్ధపడిన రాముని తో పాటు వనవాసానికి తానూ వస్తానని అనగా సీత నువ్వు రాజపుత్రికవు,సుకుమారి వి నారచీరలు ధరించి,అడవిలో కందమూలాలు తింటూ కాలినడకన ప్రయాణిస్తూ జీవించాలని అందువల్ల నీవు ఐయోధ్యలోనే నివశించమన్న శ్రీరాముని మాటకు సీతాదేవి ప్రభూ భర్త ఎక్కడో భార్య కు అక్కడే స్వర్గం,రాజప్రాసాదం, అన్న మాటతో తన పాతివ్రత్యాన్ని ప్రదర్శించిందని,నేటి హిందూ మహిళలు కూడా భర్త కష్టసుఖాల్లో పాలుచుకుంటూ సంసారాన్ని ,పిల్లలను వృద్ధిలోకి తేవాలన్న సందేశం రామాయణంలోని సీతామాత ద్వారా తెలుసుకోవాలని తెలియజేశారు.ఈకార్యక్రమంలో శారద,హేమలత,ఇతర మాతృమూర్తులు పాల్గొన్నారు.