NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

మదర్ తెరిసా సేవలు మరువలేనివి…

1 min read

– మాజీ రాజ్యసభ సభ్యులు టిజీ వెంకటేష్

పల్లెవెలుగు వెబ్ కర్నూలు: నోబెల్ బహుమతి గ్రహీత మదర్ తెరిసా సేవలు మరువలేనివని మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ అన్నారు.  మదర్ తెరిసా 113వ జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని, ఈరోజు ఆమె విగ్రహానికి పూలమాలలు వేసి టీజీ వెంకటేష్ ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కేజేఆర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన రక్తదాన శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా టీజీ వెంకటేష్ మాట్లాడుతూ.. దేశానికి సేవలు చేసిన వారిని సందర్భానుసారంగా స్మరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. భారత దేశంలో ఎటువంటి సౌకర్యాలు లేని సమయంలో ప్రజలకు విద్య, వైద్యం అందించేందుకు మదర్ తెరిసా ఎంతగానో కృషి చేసిందని అన్నారు. మదర్ తెరిసా జయంతి సందర్భంగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమని ఆయన అన్నారు .  ఇటువంటి కార్యక్రమాలు చేపట్టడం వల్ల మదర్ తెరిసా చేసినటువంటి సేవలు ప్రజల్లోకి వెళ్లి, ప్రతి ఒక్కరూ ఏదో ఒక సేవ చేయాలి అన్న భావన నెలకొల్పుతోందని టీజీ అన్నారు. ఈ కార్యక్రమంలో కేజే రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

About Author