ఉద్యమబాట పట్టిన ఉపాధ్యాయులు
1 min readపల్లెవెలుగువెబ్ : ఏపీ వ్యాప్తంగా ఉపాధ్యాయులు ఉద్యమబాట పట్టారు. నల్లబ్యాడ్జీలతో విధులకు హాజరయ్యారు. కొత్త పీఆర్సీ వల్ల తమకు అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. హెచ్ఆర్ఏ కనీస శ్లాబు 12 శాతానికి పైగా ఉండాలని డిమాండ్ చేశారు. దశల వారీగా పోరాటాలకు ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య పిలుపునిచ్చిన నేపథ్యంలో రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో ఉపాధ్యాయులు రోడ్డెక్కారు.