ముందస్తు నోటీసులతో ఉద్యమాలను ఆపలేరు – యుటిఎఫ్
1 min readపల్లెవెలుగు వెబ్ ప్యాపిలీ: ఉద్యోగ వ్యతిరేక విధానాలను అవలంభిస్తున్న రాష్ట్ర ప్రభుత్వ తీరుకు నిరసనగా ఈ నెల 27 వ తేదీన ఆంధ్రప్రదేశ్ ఐక్య కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో విజయవాడ పట్టణంలో నిర్వహించ తలపెట్టిన చలో విజయవాడ పోరాటాన్ని నిర్వీర్యం చేసే విధంగా యుటిఎఫ్ కార్యకర్తలకు ముందస్తు నోటీసులు ఇవ్వడాన్ని ఖండిస్తున్నామని,ఈ విధమైన చర్యల వల్ల ఉద్యమాలను అణిచివేయలేరని యుటిఎఫ్ జిల్లా సీనియర్ నాయకులు అబ్దుల్ లతీఫ్ పేర్కొన్నారు.పెండింగ్ లో ఉన్న ఉద్యోగ,ఉపాధ్యాయుల ఆర్థిక బకాయిలు వెంటనే చెల్లించాలని, మధ్యంతర భృతి 30 శాతం ప్రకటించాలని,బాకీ ఉన్న కరవు భత్యం విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ గత కొన్ని రోజులుగా ఆంధ్రప్రదేశ్ ఐక్య కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో పోరాటాలు చేస్తున్నామని ఐతే ఇప్పటి వరకు రెండు సార్లు ఉద్యోగ సంఘాలతో చర్చలు జరిపిన ప్రభుత్వం ఏ హామీ పైన కూడా స్పష్టమైన ప్రకటన చేయలేదని విమర్శించారు.ఈరోజు జరిగిన చర్చలు కూడా విఫలం అయ్యాయని కావున డిసెంబర్ 27 వ తేదీన జరిగే చలో విజయవాడ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.