అక్రమ అరెస్టులతో ఉద్యమాలను ఆపలేరు
1 min readపల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: జగనన్న కాలనీలలో నిర్మించే గృహ నిర్మాణానికి లబ్ధిదారులకు రూ. 5 లక్షల ప్రభుత్వం ఇవ్వాలని మార్చి రెండవ తారీఖున చేపట్టిన చలో విజయవాడ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం పోలీసుల చేత ఎక్కడికక్కడ సిపిఐ నాయకులను గృహనిర్బంధం అక్రమ అరెస్టులతో నిర్బంధాలతో ఉద్యమాలను ఆపలేరని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు వి రఘురామమూర్తి హెచ్చరించారు.స్థానిక నందికొట్కూరు పట్టణం పటేల్ సెంటర్ లో గురువారం సిపిఐ తాలూకా సమితి ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు రఘురాం మూర్తి మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ముందు ప్రకటించిన నవరత్నాల్లో భాగంగా అందరికీ ఇల్లు అన్న నినాదంతో రాష్ట్రంలో 924 జగనన్న కాలనీలో 27 లక్షల ఇళ్ల నిర్మాణ లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ ఇంతవరకు ఇంటి నిర్మాణాలు పూర్తిగా చేయడంలో వైఫల్యం చెందారని విమర్శించారు. రాష్ట్రంలో జగనన్న కాలనీలో ప్రభుత్వం చేపట్టిన సర్వేలో పట్టాలు పొందిన లబ్ధిదారులు ప్రభుత్వం ఇచ్చే లక్ష 80 వేలు ఏమాత్రం సరిపోవని నిర్మాణానికి అవసరమైన సిమెంటు, స్టీలు, ఇటుకలు, ఇసుక, కంకర,కిటికీలు,తలుపుల,ధరలు తదితర సామాగ్రి పెరుగుదలతో లబ్ధిదారులు ఇంటి నిర్మాణానికి ముందుకు రాకపోవడం వల్ల ఖాళీ స్థలాలు అలాగే ఉన్నాయన్నారు. లబ్ధిదారులు తక్షణమే ఇంటి నిర్మాణం చేపకపోతే రద్దు చేస్తామని వాలంటీర్లు బెదిరింపులకు పాల్పడడం దుర్మార్గమని అన్నారు. ఆయా కాలనీలో మౌలిక సదుపాయాలైన రోడ్లు కరెంటు నీళ్లు లేకుండా ఏ విధంగా కట్టుకుంటారో ప్రభుత్వం చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వము జగనన్న గృహాలలో మౌలిక వసతులు కల్పించి జగనన్న ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో భవిష్యత్తులో మరిన్ని ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు రమేష్ బాబు ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు శ్రీనివాసులు, జిల్లా సహాయ కార్యదర్శి మహానంది, తాలూకా అధ్యక్షులు దినేష్ వినోదు తదితరులు పాల్గొన్నారు.