ఏలూరులో సినీ నటి అనుపమ పరమేశ్వరమ్ సందడి
1 min readపల్లెవెలుగు వెబ్,ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు నగరంలో గురువారం సాయంత్రం ప్రముఖ సినీనటి యువ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ ఎక్స్పెక్ట్ డెంటల్ కేర్ హాస్పిటల్ ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా విచ్చేశారు,ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎంతో ముందు జాగ్రత్తలతో ప్రస్తుత మరియు యు రాబోయే అత్యాధునిక టెక్నాలజీ పేషెంట్ కి కావలసిన అన్ని రకాల సదుపాయాలతో సుధీర ప్రాంతాలకు వెళ్లి చికిత్స చేయించుకోవాల్సిన అవసరం లేకుండా హేలాపురి లోనే యాజమాన్యం కంప్యూటర్ టెక్నాలజీ, సెంట్రల్ ఎసి సదుపాయాoతో సువిశాలమైన ప్రాంగణంలో యాజమాన్యం నెలకొల్పడం సంతోషంగా ఉందని అన్నారు,అన్ని వేళల సేవలు సదుపాయాలు అందించే డాక్టర్లు మరియు సిబ్బంది.అందుబాటులో ఉండి ఎక్స్పర్ట్ డెంటల్ కేర్ ఏర్పాటు చేయడం డాక్టర్ హర్ష శ్రీనివాసరావుకి అభినందనీయమన్నారు, ముఖ్యంగా మనిషిలో అవయవాలు ఎంత ముఖ్య భూమిక పోషిస్తాయో అలాగే మన దంతాలు కూడా ప్రధాన భూమిక పోషిస్తాయని వాటిని సంరక్షించుకోవాల్సిన అవసరం. బాధ్యత మనపై ఎంతైనా నా ఉందన్నారు.దంతాలను వ్యాధుల బారిన పడకుండా అందుబాటులో ఉన్న డాక్టర్లుచే చికిత్స చేయించుకునే విధంగా జాగ్రత్తలు పాటిస్తూ శ్రద్ధ వహించాలన్నారు,మన చిరుమందహాసంతోనే దంతాలు (పళ్ళు)ఎదుటివారిని ఆకర్షిస్తాయని.దంతాల వ్యాధుల బారిన పడకుండా కేర్ డెంటల్ లాంటి అత్యాధునిక సదుపాయాలున్న హాస్పిటల్ సంప్రదిస్తే మనకు చింతే ఉండదని సూచించారు,ఈ కార్యక్రమానికి ఏలూరు జాయింట్ కలెక్టర్ సూరజ్ గనూర్(హౌసింగ్)నగరంలోని ప్రముఖ డాక్టర్లు వ్యాపారవేత్తలు తదితరులు పాల్గొన్నారు.