సినీ నటుడు రాజబాబు ఇకలేరు !
1 min read
పల్లెవెలుగు వెబ్ : ప్రముఖ నటుడు రాజబాబు కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆదివారం రాత్రి తుదిశ్వాస విడిచినట్టు కుటుంబసభ్యులు తెలిపారు. ఆయన మృతిపట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం ప్రకటించారు. రాజబాబు బుల్లితెరతో పాటు వెండితెరపై కూడ అలరించారు. నాటకాల మీద ఆసక్తితో దేశమంతా తిరిగారు. 1957 జూన్ 13న తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం మండలం నరసారావుపేటలో ఆయన జన్మించారు. బాల్యం నుంచి ఆయన నటనపై ఎంతో ఆసక్తి చూపేవారు. పలు విజయవంతమైన చిత్రాల్లో ఆయన నటించారు. ఆయన మృతితో సినీ పరిశ్రమలో విషాధచాయలు నెలకొన్నాయి.