సినిమా టికెట్ ధరలు తగ్గింపు.. రంగంలోకి చిరంజీవి !
1 min read
పల్లెవెలుగువెబ్ : ఏపీలో సినిమా టికెట్ ధరలు తగ్గించిన నేపథ్యంలో సినిమా ఇండస్ట్రీకి, ప్రభుత్వానికి మధ్య వివాదం నడుస్తోంది. సినిమా టికెట్ల ధరలు తగ్గింపు పై ఇటీవల హీరోలు ప్రభుత్వ వైఖరి పట్ల అసహనం వ్యక్తం చేశారు. ఏపీలో టికెట్ ధరల తగ్గింపు వ్యవహారాన్ని ఓ కొలిక్కి తెచ్చేందుకు చిరంజీవి స్వయంగా రంగంలోకి దిగనున్నట్లు తెలుస్తోంది. సంక్రాంతికి భారీ బడ్జెట్ చిత్రాలు విడుదలవుతున్న దృష్ట్యా, ఈ వ్యవహారానికి తెర దించాలని భావిస్తున్నారట. ఇందులో భాగంగా త్వరలోనే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డిని చిరంజీవి స్వయంగా కలవనున్నారని సమాచారం. ముందుగా మంత్రి పేర్నినానిని కలిసి తెలుగు చిత్ర పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలతో పాటు, ప్రధానంగా టికెట్ ధరల వ్యవహారాన్ని ఆయనతో చర్చించనున్నట్లు సినీ పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.