PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

సినిమా టికెట్ల అమ్మ‌కాలు ఇక నుంచి ఇలా జ‌ర‌గాలి !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ఆన్‌లైన్‌లో సినిమా టిక్కెట్ల అమ్మకాలపై ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం శుక్రవారం మార్గదర్శకాలను జారీ చేసింది. సినిమా టికెట్ల విక్రయాలకు సంబంధించి నోడల్ ఏజెన్సీగా ఆంధ్రప్రదేశ్‌ ఫిలిం డెవలప్‌మెంట్‌​ కార్పొరేషన్ సర్వీస్ ప్రొవైడర్ బాధ్యతల నిర్వహణ అప్పగించింది. ఇకపై రాష్టంలోని థియేటర్లు ఏపీఎఫ్‌డీసీతో అగ్రిమెంట్ చేసుకోవాలి. అన్ని థియేటర్లు,ప్రయివేట్ సంస్థలు నోడల్ ఏజెన్సీ సర్వీస్ ప్రొవైడర్ గేట్ వే ద్వారానే అమ్మకాలు చేపట్టాలి. విక్రయించే ప్రతి టికెట్ పై 2 శాతం మాత్రం సర్వీస్ చార్జీ వసూలు చేయాలి. థియేటర్లలో ఎటువంటి అవకతవకలు లేకుండా పక్కాగా ఆన్‌లైన్‌ టికెట్ల అమ్మకాలు చేయాలి. కొత్త సినిమా విడుదల నేపథ్యంలో వారం ముందు నుంచి మాత్రమే టిక్కెట్లు అమ్మకాలు జరపాలి.

                                               

About Author