NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ప‌వ‌న్ క‌ళ్యాణ్ తో సినిమా.. ఎప్పుడో చెప్పిన రాజ‌మౌళి

1 min read

పల్లెవెలుగు వెబ్​:ప‌వ‌న్ క‌ళ్యాణ్ , రాజ‌మౌళిల కాంబినేష‌న్ కోసం ప‌వ‌ర్ స్టార్ అభిమానులు ఎంతో ఆత్రుత‌గా ఎదురుచూస్తున్నారు. ఇటీవ‌ల ఆయ‌న శ్రీకాకుళం జిల్లా రాగోలు జెమ్స్ వైద్య క‌ళాశాల స్నాత‌కోత్సవంలో పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా ప‌వ‌న్ క‌ళ్యాణ్ తో సినిమా ఎప్పుడంటూ అభిమానులు ఆయ‌న‌ను అడిగారు. ప‌వ‌న్ క‌ళ్యాణ్ తో సినిమా చేయాల‌ని ఎంతో కాలం నుంచి చూస్తున్నాన‌ని చెప్పారు. ఒక‌సారి క‌లిశాను. మ‌రోసారి షూటింగ్ లో కలిశాను. స‌మ‌యం ఇస్తే క‌థ చెబుతాన‌ని అన్నాను. ఏడాదిన్నర చూశా. ఎలాంటి క‌బురు రాలేదు. ఆయ‌న వేరే సినిమాల్లో బిజీ అయ్యారు. నేనేమో భారీ సినిమాల వైపు వెళ్లాను. ప‌వ‌న్ రాజ‌కీయాల‌పై దృష్టి పెట్టారు. ఇద్దరం వేర్వేరు మార్గాల్లో ఉన్నాం అంటూ అభిమానుల‌తో చెప్పారు.

About Author