PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఈ వారం విడుద‌ల‌య్యే సినిమాలు

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్ : తెలుగు సినిమాలు ఈ వారం సంద‌డి చేయ‌బోతున్నాయి. తెలంగాణ‌లో థియేట‌ర్లు తెరిచిన‌ప్పటికీ..ఏపీలో ఇంకా తెర‌వ‌లేదు. దీంతో చాలా సినిమాలు ఓటీటీ వేదిక‌గా విడుద‌ల అవుతున్నాయి. కొన్ని సినిమాలు మాత్రం థియేట‌ర్లలో విడుద‌ల అవుతున్నాయి.

  • ఇష్క్ .. నాట్ ఏ ల‌వ్ స్టోరీ
    తేజ స‌జ్జ, ప్రియా ప్రకాశ్ వారియర్ జంట‌గా న‌టిస్తున్నారు. ఇష్క్ సినిమాను థియేట‌ర్లో విడుద‌ల చేస్తామ‌ని ఇప్పటికే చిత్ర బృందం ప్రక‌టించింది. ఈ సినిమాకు ఎస్.ఎస్. రాజు ద‌ర్శక‌త్వం వ‌హించారు. ఆర్ బి చౌద‌రి స‌మ‌ర్పణ‌లో ఎన్.వి ప్రసాద్, ప‌రాస్ జైన్, వాకాడ అంజ‌న్ కుమార్ నిర్మించారు. మ‌హతి సాగ‌ర్ సంగీతం అందించారు. జులై 30వ తేదిన సినిమా థియేటర్లలో ఈ సినిమా విడ‌దుల అవుతుంది.
  • తిమ్మర‌సు
    స‌త్యదేవ్ నటించిన ‘తిమ్మర‌సు’ చిత్రం ఈ వారం విడుద‌ల కాబోతోంది. జులై 30న ఈ సినిమా కూడ థియేట‌ర్లలో విడుద‌ల అవుతుంది. శ‌ర‌ణ్ కొప్పిశెట్టి ద‌ర్శక‌త్వం వ‌హించారు. ప్రియాంక జువాల్కర్ క‌థానాయ‌క‌. మ‌హేష్ కోనేరు నిర్మించారు. శ్రీచ‌ర‌ణ్ పాకాల సంగీతం అందించారు.
  • వ‌న్
    మ‌ళయాళ స్టార్ హీరో మ‌మ్ముట్టి న‌టించిన చిత్రం ‘వ‌న్’. జులై 30న ఆహా ఓటీటీలో విడుద‌ల కానుంది.

About Author