వైసీపీ కురువలకు యంపీ,ఎమ్మెల్యే టికెట్లను కేటాయించాలి
1 min readతాడెపల్లిలో వైసీపీ ప్రధాన కార్యదర్శి,ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిని కలిసిన కురువ, మదాసి కురువ/మదారి కురువ పొలిటికల్ జేఏసీ నేతలు.
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: కర్నూలు జిల్లాలో కురువ,మదాసి కురువ/మదారి కురువలకు యంపీ/ఎమ్మెల్యే స్థానాలను కేటాయించాలని ప్రభుత్వ సలహాదారు,వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డిని హిందూపురం యంపీ గోరంట్ల మాధవ్ తో కలిసి తాడెపల్లి కార్యాలయంలో కురువ,మదాసి కురువ/మదారి కురువ పొలిటికల్ జేఏసీ చైర్మన్ రాయలసీమ రవికుమార్,కె.బలరాం,మదాసి కురువ సుంకన్న,కురువ శ్రీనివాసరావు,కె.మహేంద్ర,కె.శివయ్య లు కలిసి వినతిపత్రం సమర్పించి సజ్జల రామకృష్ణారెడ్డితో చర్చించారు ఈ సందర్భంగా జేఏసీ చైర్మన్ రాయలసీమ రవికుమార్ మాట్లాడుతూ కర్నూలు జిల్లాలో అతిపెద్ద సామాజిక వర్గాలలో ఒకటైన కురువ,మదాసి కురువ/మదారి కురువలకు వైసీపీ ఇదివరకు విడుదల చేసిన అభ్యర్థుల లిస్టులలో ఏ లిస్టులో కూడా కురువ సామాజిక వర్గానికి స్థానం కల్పించకపోవడం తమను తీవ్ర మనోవేదన గురిచేసిందని ఉమ్మడి కర్నూలు జిల్లాలో పత్తికొండ నియోజకవర్గంలో 70వేల కురువల ఓటుబ్యాంకు,ఆలూరులో 65వేల ఓటుబ్యాంకు,ఎమ్మిగనూరు, ఆదోని నియోజకవర్గాల్లో 45వేల ఓటుబ్యాంకు మంత్రాలయం, కోడుమూరు,కర్నూలు నియోజకవర్గాలలో 30నుండి 45వేల ఓటుబ్యాంకు,పాణ్యం,డోన్, నందికొట్కూరు నియోజకవర్గాల్లో 35వేల పైన ఓటుబ్యాంకు,శ్రీశైలం, నంద్యాల,బనగానపల్లె,ఆళ్లగడ్డ లలో 25వేల పైన ఓటుబ్యాంకు కలిగిన కూడా ఎందుకు కురువ, మదాసి కురువ/మదారి కురువ సామాజిక వర్గానికి వైసీపీ టికెట్లను కేటాయించలేదనే ఆవేదనతో జిల్లాలో తమ సామాజిక వర్గం ఉందన్న విషయాన్ని సజ్జల రామకృష్ణారెడ్డికి తెలియచేసారు. అనంతరం సజ్జల రామకృష్ణారెడ్డి జేఏసీ నాయకులతో మాట్లాడుతూ కురువ సామాజిక వర్గానికి న్యాయం చేయాల్సిన బాధ్యత తమ పార్టీపై ఉందని ఇదే విషయాన్ని పార్టీ అధినేత,ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తో చర్చించి కురువలకు తప్పక రాబోయే ఎన్నికల్లో న్యాయం చేస్తామని హామీ ఇచ్చారని జేఏసీ నేతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రమేష్,కృష్ణ,భరత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.