రోడ్డు ప్రమాదంలో ఎంపీపీ మృతి !
1 min read
పల్లెవెలుగువెబ్ : కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గం, ఉంగుటూరు మండలం ఎంపీపీ పులపాక ప్రసన్నకుమారి రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. మంగళవారం రాత్రి భార్య భర్తలు ఓ ప్రైవేట్ కార్యక్రమానికి ద్విచక్ర వాహనంపై వెళుతుండగా ఆనందపురం రోడ్‌లో గుంతను తప్పించే సమయంలో బైక్ అదుపుతప్పి పడిపోయింది. ఎంపీపీ ప్రసన్న కుమారికి తీవ్ర గాయాలు కాగా.. భర్తకు స్వల్ప గాయాలయ్యాయి. ప్రసన్నకుమారిని దగ్గర్లో ఉన్న పిన్నమనేని ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆమె బుధవారం ఉదయం మృతి చెందారు.