NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఘనంగా ఎంపీ మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు..

1 min read

– హజరత్ జమాలుల్లా సాహి దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు.,అన్నదాన కార్యక్రమం

పల్లెవెలుగు వెబ్ అన్నమయ్య జిల్లా బ్యూరో:  అన్నమయ్య జిల్లా రాయచోటిలో లోకసభ ప్యానెల్ స్పీకర్ రాజంపేట పార్లమెంట్ సభ్యులు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి  జన్మదిన వేడుకలను సంబరంగా నిర్వహించారు. ముందుగా పట్టణంలోని వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యే కార్యాలయం నందు కేక్ కటింగ్ నిర్వహించారు. అన్నమయ్య జిల్లా వైకాపా విభాగం మైనార్టీ జిల్లా అధ్యక్షులు బేపారి మహమ్మద్ ఖాన్ ఆధ్వర్యంలో హజరత్ జమాలుల్ల షాహి దర్గాలో మున్సిపల్ చైర్మన్ షేక్ ఫయాజ్ భాష వైస్ చైర్మన్ ఫయాజు రెహ్మాన్ ఇతర వైకాపా ప్రజా ప్రతినిధులు, మైనార్టీ నేతలతో కలిసి వారు  ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం పేదలకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.అంతేకాకుండా పట్టణంలోనున్న యాచకులకు ఆహారం ప్యాకెట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మిథున్  అన్న జన్మదిన వేడుకలను ఒక పండగ వాతావరణం లో నిర్వహించడం జరిగిందన్నారు. వారికి అల్లా ఆశీస్సులు, దేవుని దయ, ఏసుప్రభు  కృపతో,ప్రజలు దీవెనలతో ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు కలగాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నామన్నారు. ఎమ్మెల్యే గడి కోట శ్రీకాంత్ రెడ్డికి వారి తోడ్పాటును అందిస్తూ రాయచోటి అభివృద్ధికి అహర్నిశులు కృషి చేస్తున్నారన్నారు. భవిష్యత్తులో కూడా జగన్మోహన్ రెడ్డి  నాయకత్వంలో ఎంపీ మిథున్ రెడ్డి, ఎమ్మెల్యే గడి కోట శ్రీకాంత్ రెడ్డి ఎంపీ ఎమ్మెల్యేలు గెలిచి ప్రజలకు, రాయచోటి అభివృద్ధికి తోడ్పాటు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మునిసిపల్ కౌన్సిలర్ అన్నా సలీం, వైకాపా నాయకులు సుగవాసి శ్యాం,గువ్వల బుజ్జిబాబు, కొత్తపల్లి ఇంతియాజ్, ముదిరాజ్ జిల్లా అధ్యక్షులు దేవేంద్ర కుమార్, అజంతుల్లా మూసా, రాయచోటి నియోజకవర్గం నూర్ భాషా సంఘం అధ్యక్షులు అజంతుల్లా, బేపారి జబీబల్లా, అసద్ ఖాన్, తదితర మైనార్టీ వైకాపా, ప్రజా ప్రతినిధులు కార్యకర్తలు అభిమానులు హాజరయ్యారు.

About Author