రోడ్లను ప్రారంభించిన ఎంపీ పోచా,సిద్ధార్థ రెడ్డి
1 min readపల్లెవెలుగు వెబ్ మిడుతూరు: మిడుతూరు మండల పరిధిలోని పీరు సాహెబ్ పేట గ్రామంలో సీసీ రోడ్డు మరియు మెటల్ రోడ్డు రహదారిని నంద్యాల ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి మరియు శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి శనివారం సాయంత్రం ప్రారంభించారు.ఇందిరమ్మ కాలనీలో నంద్యాల ఎంపీ నిధులతో 9లక్షల 75 వేల రూపాయలతో సీసీ రోడ్డును మరియు నూతనంగా నిర్మించిన ఈద్గా దగ్గర పొలాలకు వెళ్లే రహదారి 25 లక్షల రూపాయలతో మెటల్ రోడ్డును వేయించారు.వీటిని ప్రారంభించడానికి గ్రామానికి వచ్చిన ఎంపీ పోచా బ్రహ్మానంద రెడ్డికి మరియు శాప్ చైర్మన్ సిద్ధార్థ రెడ్డికి గ్రామ సర్పంచ్ పాపిరెడ్డి చంద్రశేఖర రెడ్డి ఆధ్వర్యంలో గ్రామంలో మేళ తాళాలు మరియు భారీ టపాకాయలు కాలుస్తూ పూలతో ఘనస్వాగతం పలికారు.గ్రామంలో ఇందిరమ్మ కాలనీలో మరియు పొలాల రస్తా అధ్వానంగా ఉండడం ఈ రస్తాలో రైతులు పొలాలకు వెళ్లాలంటే ఇబ్బందికరంగా ఉంటుందని ఈ విషయమై గ్రామ సర్పంచ్ మరియు నాయకులు సిద్ధార్థ రెడ్డి మరియు ఎంపీ దృష్టికి తీసుకు వెళ్లిన వెంటనే రోడ్లకు నిధులు మంజూరు చేశారని అందువల్ల రోడ్లను వేయించడం జరిగిందని సర్పంచ్ తెలిపారు.ఈ కార్యక్రమంలో స్థానిక వైసీపీ నాయకులు కైపా శ్రీధర్ రెడ్డి, నాయుడు,జగదీశ్ రెడ్డి,జడ్పిటిసి పర్వత యుగంధర్ రెడ్డి,ఎంపీపీ మల్లు వెంకటేశ్వరమ్మ, నందికొట్కూరు నియోజకవర్గ వైసీపీ నాయకులు వై.చంద్రమౌళి,ఏఎంసీ మాజీ చైర్మన్ చిన్న మల్లారెడ్డి,ఐటీ వింగ్ జిల్లా అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి,రామ్మోహన్ రెడ్డి మరియు వివిధ గ్రామాల నాయకులు పాల్గొన్నారు.