మోదీ గడ్డం పై ఎంపీ సెటైర్ !
1 min readపల్లెవెలుగు వెబ్ : మోదీ గడ్డం పై కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ సెటైర్ వేశారు. ఆంగ్ల భాషా పరిజ్ఞానంలో శశి థరూర్ దిట్ట. ఆయన స్పీచ్ ఇస్తే.. ఆ పదాలకు అర్థాలు డిక్షనరీలో వెతుక్కోవాల్సిందే. ‘పొగొనోట్రోఫి’ అనే పదం వాడి ఆయన ట్విట్టర్ లో హల్ చల్ సృష్టించారు. ఆ పదంతో మోదీ గడ్డానికి లంకె పెట్టారు. పొగోనోట్రోఫీ అంటే గడ్డం పెంచడం అని అర్థం. కరోన సమయంలో మోదీ పొగోనోట్రోఫియే చేస్తున్నారని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. కొత్త పదం నేర్పాలని ఓ వైద్యురాలు ట్విట్టర్ లో అడిగిన ప్రశ్నకు .. నా స్నేహితుడు రతిన్ రాయ్ ఒక కొత్త పదం నేర్పించారు. ఆ పదం పొగోనోట్రోఫి. అంటే గడ్డం పెంచడం. కరోన సమయంలో ప్రధానికి కూడ పొగోనోట్రోఫి వ్యాపకంగా మారిందని అన్నారు.