NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

డీఎస్సీ ఉచిత ఆన్ లైన్ శిక్షణా తరగతుల పోస్టర్ ని ఆవిష్కరించిన ఎం.పి

1 min read

కర్నూలు, న్యూస్​ నేడు:  డీఎస్సీ అభ్యర్థులు ఉచిత ఆన్ లైన్ శిక్షణా తరగతులను సద్వినియోగం చేసుకోవాలని కర్నూలు ఎం.పి బస్తిపాటి నాగరాజు సూచించారు.. ఎం.పి నాగరాజు సహకారంతో జిల్లా యువజన సంక్షేమ శాఖ సెట్కూరు మరియు జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో కర్నూలు పార్లమెంట్ పరిధిలో ని డీఎస్సీ 2025 ఎస్జీటీ అభ్యర్థులకు ఉచిత ఆన్ లైన్ శిక్షణా తరగతుల కు సంబంధించిన పోస్టర్ ను జిల్లా కలెక్టర్ బాంగ్లాలో కలెక్టర్ రంజిత్  బాషాతో కలిసి ఎం.పి ఆవిష్కరించారు… ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముందుగా రిజిస్టర్ చేసుకున్న 500 మంది అభ్యర్థులకు మాత్రమే ఉచిత శిక్షణా తరగతులు ఇవ్వడం జరుగుతుందని, ఈ నెల 7 వ తేది లోపల ఆసక్తి గల అభ్యర్థులు రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు.. రిజిస్ట్రేషన్ కోసం 9292207601 అనే ఫోన్ నెంబర్ కి వాట్సప్ ద్వారా తమ పేరు , అడ్రెస్ వివరాలతో పాటు ఆధార్ కార్డు, డీఈడీ సర్టిఫికేట్ కాపీలను పంపాలన్నారు.. ఇక రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ముఖ్య మంత్రి చంద్రబాబు డి.ఎస్.సి ఫైల్ పై తొలి సంతకం చేసి ఇచ్చిన మాట ప్రకారం మెగా డి.ఎస్.సి నోటిఫికేషన్ విడుదల చేయడమైనదని తెలిపారు. గత వైసిపి ప్రభుత్వం లో కర్నూలు జిల్లాలో టీచర్ల కొరత అధికంగా ఉండి విద్యార్థుల అభివృద్ధి కి తీవ్ర ఆటంకంగా ఉండిందని, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్  కర్నూలు జిల్లా పై ప్రత్యేక శ్రద్ధ చూపి అత్యధిక టీచర్ పోస్టులను కేటాయించారని, అందులో 1680 సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టులను కేటాయించారని తెలియచేసారు. కర్నూలు పార్లమెంట్ పరిధిలోని అభ్యర్థులు కోచింగ్ కొరకు అనేక వ్యయ ప్రయాసలకు గురి అవుతున్న విషయం ను దృష్టిలో ఉంచుకొని రాష్ట్రం లో ఉత్తమ కోచింగ్ అందిస్తున్న ఎస్ పబ్లికేషన్స్ వారితో మాట్లాడి కర్నూలు పార్లమెంట్ పరిధిలో ని అభ్యర్థులకు ఉచిత ఆన్ లైన్ కోచింగ్ అందిస్తున్నామని ఎం.పి తెలిపారు… ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి శ్యాముల్ పాల్, సెట్కూరు సీ.ఈ.ఓ వేణు గోపాల్,   ఎంప్లాయిమెంట్ అధికారి సోమ శేఖర రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *