వైయస్సార్ హెల్త్ క్లినిక్ సందర్శించిన ఎంపీడీవో రాజ్ మనోజ్
1 min read– హెల్త్ క్లినిక్ వచ్చే పేషంట్ల వైద్య సేవలపై ఆరా..
– రోగులకు విధమైన ఇబ్బంది లేకుండా సిబ్బంది వైద్య సేవలు అందించాలి..
పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా : పెదవేగి మండలం ముండురు వైఎస్ ఆర్ హెల్త్ క్లినిక్ లో బుధవారం డాక్టర్ భార్గవి కుటుంబ ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. గ్రామంలో 72 మంది పేషేంట్లు హెల్త్ క్లినిక్ కి వచ్చి ఆరోగ్య పరీక్షలు చేయించుకున్నారు. వారిలో 23 మంది గర్భవతులు కూడా ఉన్నారు.గర్భవతులు రక్త హీనత ఏర్పడకుండా ఉండేందుకు డాక్టర్ భార్గవి ఐరన్ మాత్రలు పంపిణీ చేశారు. వారిలో నలుగురు గర్భవతులకు రక్తహీనతతో ఉండటం గమనించి ఆకు కూరలు. పండ్లు. కోడి గుడ్లు.పాలు వంటి పౌష్టిక ఆహార పదార్థాలు తీసుకోవాలని సరైన విశ్రాంతిని తీసుకోవాలని డాక్టర్ భార్గవి సూచించారు.ఈ కార్య క్రమం లో పెదవేగి ఎం పి డి ఓ జి రాజ్ మనోజ్ పర్యవే క్షించారు. రోగులకు ఏ విధమైన సౌకర్యం, ఇబ్బంది తలెత్తకుండా సిబ్బంది సహనంతో వైద్య సేవలు అందించాలని సూచించారు. ఈ కార్యక్రమం లో ముండురు ఎం ఎల్ హెచ్ పి సాయి, ఏ ఎన్ ఎం మంగా దేవి, హెల్త్ అసిస్టెంట్, గోవిందరాజు, ఆశావర్కర్ వజ్రం తదితరులు పాల్గొన్నారు.