PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

Mr ఛాయి.. చికెన్ కేఫ్ సెంటర్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే

1 min read

పల్లెవెలుగు వెబ్ బనగానపల్లె : పట్టణం ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో నూకల రెసిడెన్సీలో మిస్టర్ చాయ్ మిస్టర్ చికెన్ కేప్ సెంటర్ ను బనగానపల్లె నియోజకవర్గం శాసనసభ్యులు కాటసాని రామిరెడ్డి గారు రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. కేఫ్ సెంటర్ నిర్వాహకుడు నజీర్ అహ్మద్ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి గారికి పూలమాలతో ఘనంగా స్వాగతం పలికారు అనంతరం శాలువాకప్పి సత్కరించారు. ఈ కార్యక్రమంలో అవుకు మండలం వైఎస్ఆర్ పార్టీ కన్వీనర్ కాటసాని తిరు పాల్ రెడ్డి, జిల్లా వైఎస్ఆర్ పార్టీ ప్రచార కార్యదర్శి సిద్దం రెడ్డి రామ్మోహన్ రెడ్డి, వైయస్సార్ పార్టీ నాయకులు ఆల్లె సురేష్ కుమార్ రెడ్డి ,జిల్లెల్ల శివరామిరెడ్డి ,జిల్లెళ్ళ శంకర్ రెడ్డి రమణారెడ్డి, ఆల్లె వెంకటసుబ్బారెడ్డి లతోపాటు వైయస్సార్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.ఈ సందర్భంగా బనగానపల్లె నియోజకవర్గ శాసనసభ్యులు కాటసాని రామిరెడ్డి గారు మాట్లాడుతూ భారతీయులకు ప్రత్యేకంగా ఉత్తేజకరమైన పానీయం టీ అని చెప్పారు. సూర్యోదయమైన వెంటనే ప్రతి ఒక్కరూ టీ ని ఆస్వాదిస్తారని చెప్పారు. కేఫ్ సెంటర్లో టీతోపాటు చికెన్ తో చేసినటువంటి పిజ్జా చికెన్ కెఎఫ్సి పీసులు లభిస్తాయని చెప్పారు. యువత ఉద్యోగాలకే పరిమితం కాకుండా స్వయం ఉపాధి ద్వారా ఉపాధి ఉపాధి అవకాశాలు ఉపయోగించవచ్చని చెప్పారు.

About Author