PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఆలూరు తాలూకాలో శ్రీ.వీరభద్ర గౌడ్  సుడిగాలి పర్యటన  

1 min read

పల్లెవెలుగు వెబ్ ఆలూరు:  మన తెలుగుదేశం పార్టీ జాతీయ నాయకులు, సమైక్యాంధ్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు గౌ.శ్రీనారా చంద్రబాబు నాయుడు .మన ఆలూరు తాలూకా తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి…గౌ.శ్రీవీరభద్ర గౌడ్ ని నియమించినందుకు శ్రీవీరభద్ర గౌడ్  బాబుగారికి కృతజ్ఞతలు తెలుపారు.అనంతరం ఎల్లార్తి శ్రీగురు శేక్షావలి,శ్రీశాశావలి స్వామి వారిని అలాగే గౌ.వీరభద్ర గౌడ్  బొమ్మగుండనహళ్లి స్వగ్రామ దేవత శ్రీరాములమ్మ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.అనంతరం బాబు పేదల అభ్యున్నతి కోసం ప్రకటించిన సూపర్ సిక్స్ పథకాల గురించి ఆయా గ్రామాల ప్రజలకు వివరించి తెలియజేశారు.ఈకార్యక్రమంలో యువ నాయకులు గౌ.గిరిమల్లేశ్  అలాగే ఎల్లార్తి మరియు పెద్దహ్యాట,BG హల్లి, చిన్నహ్యాట గ్రామాల TDP నాయకులు మరియు ఆలూరు తాలూకా ఆరు మండలాల TDP  సీనియర్ నాయకులు, కార్యకర్తలు,వివిధ హోదాలలో ఉన్న TDP నాయకులు కార్యకర్తలు అందరూ పెద్దఎత్తున పాల్గొనడం జరిగింది.

About Author