వైసిపి ప్రభుత్వంలో ముదిరాజ్ లకు ఒరిగిందేమీ లేదు
1 min readపల్లెవెలుగు వెబ్ కడప : నాలుగు సంవత్సరాల వైసిపి పరిపాలనలో రాష్ట్రంలోని ఏ ఒక్క ముదిరాజ్ కుటుంబానికి ఆర్థికంగా సామాజికంగా న్యాయం జరగలేదని తెలుగుదేశం పార్టీ కడప ముదిరాజ్ సంఘం నాయకులు భరత్ కుమార్, యామల మణికంఠ విమర్శించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ కేవలం నామమాత్రపు కార్పొరేషన్ ఏర్పాటు చేశారని ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా ముదిరాజ్ కార్పొరేషన్ ద్వారా విడుదల చేసి సంఘం అభివృద్ధికి ఎలాంటి కృషి వైసిపి చేయలేదని తెలిపారు,బీసీ కార్పొరేషన్ నిధులను నవరత్నాలకు మళ్లించి తన సొంత ప్రచారం కోసం వైయస్ జగన్ వాడుకున్నారని తెలిపారు,కనీసం కార్పొరేషన్ చైర్మన్ లకు ట్రావెల్స్ కూడా నిధులు కేటాయించలేని వైసిపి ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ముదిరాజులకు ఏ విధంగా న్యాయం చేస్తుందని ప్రశ్నించారు,కొంతమంది సంఘ నాయకులు వారి లబ్ధి కోసం వైసిపి ప్రభుత్వాన్ని విమర్శించకుండా సన్మానం చేయడం తగదని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో చెన్నూరు మండల నాయకుడు మణికంఠ, రాజేష్ పాల్గొన్నారు.