NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

లండ‌న్ కు మ‌కాం మార్చిన ముఖేశ్ అంబానీ !

1 min read

పల్లెవెలుగు వెబ్​ : భారతీయ సంప‌న్నుడు ముఖేశ్ అంబానీ త‌న కుంటుంబ కోసం బ్రిట‌న్ లో విశాల సౌధాన్ని సిద్ధం చేస్తున్నార‌ని మిడ్ డే వార్త సంస్థ పేర్కొంది. లండ‌న్ లోని బ‌కింగ్ హాం షైర్ వ‌ద్ద ఉన్న 300 ఎక‌రాల్లోని స్టోన్ పార్క్ అంబానీకి రెండో సౌధం కానుంద‌ని ఆ సంస్థ తెలిపింది. ప్రస్తుతం ముఖేశ్ అంబానీ కుటుంబం ముంబైలోని అత్యంత ఖ‌రీదైన ప్రాంతంలోని ‘యాంటీలియో’ భ‌వ‌నంలో నివాసం ఉంటోంది. అయితే.. త‌మ అవ‌స‌రాల‌కు అనుగుణంగా లండ‌న్ లో కూడ 592 కోట్లతో స్టోన్ పార్క్ సౌధాన్ని కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది. ఇందులో 49 ప‌డ‌క గ‌దుల‌తో పాటు ప్రత్యేకంగా నిర్మించిన ఆస్పత్రి కూడ ఉంద‌ని స‌మాచారం. అయితే.. ముఖేశ్ అంబానీ ముంబైలోనే ఉంటార‌ని రిల‌య‌న్స్ సంస్థ తెలిపింది. లండ‌న్ కు మకాం మార్చడంలేద‌ని తెలిపారు. కేవ‌లం భార‌తీయ ఆతిథ్యాన్ని ప్రపంచానికి ప‌రిచయం చేసేందుకే ఆ సౌధాన్ని వినియోగిస్తామ‌ని ఆ సంస్థ తెలిపింది.

About Author