మొదలైన మూల పెద్దమ్మ జాతర
1 min readపల్లెవెలుగు వెబ్ గడివేముల: మండల పరిధిలోని ఉగాది పండుగ రోజు తర్వాత ప్రారంభమయ్యే శ్రీ మూల పెద్దమ్మ తల్లి జాతరకు సర్వం సిద్ధం అయ్యింది . నంద్యాల జిల్లాలోని అత్యంత ప్రాముఖ్యత కలిగి ప్రజల కష్టాలను కడతర్చే కల్పవల్లిగా పేరుపొంది భక్తాదులచే పూజలు అందుకుంటు ప్రతి సంవత్సరం గడివేముల గ్రామంలో అత్యంత వైభవంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా జరిగే శ్రీ మూల పెద్దమ్మ జాతరకు సర్వం సిద్ధం చేశామని ఆలయ కార్యనిర్మాణాధికారి సీతా మోహన్ తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీ మూల పెద్దమ్మ జాతర 10-04-24 నుండి 11-04-24 వ తేదీ వరకు జరుగుతాయని,10 వ తేదీన సాయంకాలం 06:00 శ్రీ మూలపెద్దమ్మ అమ్మవారికి ఘట్టం కార్యక్రమం ప్రారంభమైన తర్వాత ప్రత్యేక ఆకుపూజ మరియు కుంకుమార్చన నిర్వహించిన అనంతరం భక్తాదులు బోనం కుండలతో ప్రత్యేక నైవేద్యంతో అమ్మవారికి మొక్కులు తీర్చుకోని అమ్మవారి కృపకు పాత్రులై దర్శించుకుంటారని, సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా11వ తేదీన ఆలయ ప్రాంగణంలో ఉదయం 10:00 గంటలకు తాడు లాగు పందెములు మరియు గుండు ఎత్తుపందెం మరియు స్లో బైక్ రేసు పోటీలను నిర్వహిస్తామని,వివిధ ప్రాంతాల నుండి శ్రీ మూల పెద్దమ్మను దర్శించుకునేందుకు వచ్చే భక్తులు ఎలాంటి ఆసౌకర్యాలకు గురికాకుండా ప్రత్యేక దర్శన క్యూ లైన్ లను ఏర్పాటు చేశామని, ఆలయప్రాంగణంలో మంచినీటి సౌకర్యం కల్పించామని,ఆలయ ప్రాంగణం మొత్తం సర్వాంగ సుందరంగా విద్యుత్ దీపాలంకరణతో అలంకరించామని,వివిధ ప్రాంతాల నుండి శ్రీ మూల పెద్దమ్మ అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తాదులు గడివేములగ్రామానికిరావడానికినంద్యాల,నందికొట్కూరు ఆత్మకూరు మరియు కర్నూలు నుండి ఏపీఎస్ఆర్టీసీ వారు ప్రత్యేక బస్సుసౌకర్యాలను ఏర్పాటు చేశారని ఈ అవకాశాన్ని భక్తాదులు గమనించి సద్వినియోగం చేసుకోవాలని,ఆలయ ప్రాంగణంలో ఎలాంటి అసాంఘిక కార్యక్రమాలకు తావు లేకుండా పాణ్యం సీఐ నల్లప్ప.మరియు.గడివేములఎస్సైబిటి.వెంకటసుబ్బయ్యల ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బంది పర్యవేక్షణ ఏర్పాటు చేశారని శ్రీ మూల పెద్దమ్మ ఆలయ కార్య నిర్వహణ అధికారి మోహన్ మరియు ఆలయ చైర్మన్ చిన్నన్న తెలిపారు.