PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

లోకేష్ సమక్షంలో టిడిపిలో చేరిన మునగపాటి

1 min read

– పసుపు కండువా కప్పి సాదరంగా ఆహ్వానించిన యువనేత
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: మంగళగిరి శివాలయం ట్రస్ట్ బోర్డు మాజీ చైర్మన్, ఆంధ్ర ప్రదేశ్ పద్మశాలీయ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్, వైసిపి నాయకుడు డాక్టర్ మునగపాటి వెంకటేశ్వరరావు యువనేత నారా లోకేష్ సమక్షంలో టిడిపిలో చేరారు. ఆదోని నియోజకర్గం కుప్పగల్లు శివార్లలో భోజన విరామ సమయంలో డాక్టర్ మునగపాటి యువనేతను కలిశారు. పసుపుకండువా కప్పి మునగపాటిని యువనేత సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. డాక్టర్ మునగపాటితోపాటు ఆయన కుమారుడు చినరాజా, సోదరుడు రమేష్ కూడా పార్టీలో చేరారు. మంగళగిరి ఇందిరనగర్ కు చెందిన మునగపాటి వెంకటేశ్వరరావు 2009లో మంగళగిరి బిజెపి ఎమ్మెల్యే అభ్యర్దిగా పోటీ చేశారు. 2014-19 నడుమ డాక్టర్ మునగపాటి మంగళగిరి మున్సిపాలిటీ కౌన్సిలర్ గా పనిచేశారు. మంగళగిరి 5, 6 వార్డుల అభివృద్దిలో క్రియాశీలక పాత్ర పోషించారు. ఆంధ్ర ప్రదేశ్ పద్మశాలీయ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ గా మునగపాటి వెంకటేశ్వరరావు కొనసాగుతూ పద్మశాలీల అభ్యున్నతికి రాష్ట్ర స్దాయిలో కీలకపాత్ర పోషిస్తున్నారు. 2020నుంచి మంగళగిరి శ్రీ గంగా భ్రమరాంబ సమేత మల్లేశ్వరస్వామి వార్ల దేవస్దానం ( శివాలయం) ట్రస్ట్ బోర్డు చైర్మన్ గా రెండేళ్ల పాటు పని చేశారు. 2010లో ప్రారంభమైన శ్రీ గంగా భ్రమరాంబ సమేత మల్లేశ్వరస్వామి వార్ల అన్నదాన ట్రస్ట్ నిర్వహణలో కీలకపాత్ర పోషిస్తున్నారు. మునగపాటి నాగయ్య ఛారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ గా సేవాకార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. 2019 ఎన్నికలకు ముందు బిజెపిని వీడి వైకాపాలో చేరారు. 2022లో ఆధ్యాత్మిక, సామాజిక సేవలకు గుర్తింపుగా గ్లోబల్ హ్యూమన్ ఫీస్ యూనివర్శిటీ వారు మునగపాటి వెంకటేశ్వరరావు కు డాక్టరేట్ ప్రదానం చేశారు. డాక్టర్ మునగపాటి రాక మంగళగిరి టిడిపికి అదనపు బలం చేకూరినట్లయింది. ఈ కార్యక్రమంలో టిడిపి ముఖ్య నేతలు నేతలు నిమ్మల రామానాయుడు, అమర్ నాథ్ రెడ్డి, ధూళిపాళ నరేంద్రకుమార్, మంగళగిరి నియోజకవర్గ టిడిపి వ్యవహారాల సమన్వయకర్త నందం అబద్దయ్య,టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి తమ్మిశెట్టి జానకి దేవి, పట్టణ పార్టీ అధ్యక్షులు దామర్ల రాజు,టీడీపీ నాయకులు గుత్తికొండ ధనుంజయరావు,రంగిశెట్టి నరేంద్ర (బాబీ),గోవాడ దుర్గారావు, కారంపూడి అంకమ్మరావు, పడవల మహేష్,కనికళ్ళ చిరంజీవి,వాకా మంగారావు, కందుల నాగార్జున, బోగి వినోద్,అన్నం నాగబాబు, జొన్నాదుల రామాంజనేయులు, కొత్తపల్లి శ్రీనివాసరావు, సుఖమంచి గిరి,గోసాల రాఘవ, బుదాటి శ్రీనివాసరావు, తోట గౌరి శంకర్,అవ్వారు వంశీ,తమ్మిశెట్టి హరికృష్ణ,దాసరి సునీల్, తాటి అవినాష్ తదితరులు ఉన్నారు.

About Author