PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

నందికొట్కూరు  మున్సిపల్ కమిషనర్ గా టి.సుధాకర్ రెడ్డి

1 min read

మర్యాదపూర్వకంగా చైర్మన్ ను  కలిసిన కమిషనర్.

మున్సిపాలిటీ అభివృద్ధి కోసం కృషి చేస్తా..

పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: నందికొట్కూరు మున్సిపల్ కమిషనర్ గా టి.సుధాకర్ రెడ్డి శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన బదిలీల్లో భాగంగా  ఇక్కడ బాధ్యతలు నిర్వహిస్తున్న కమిషనర్ పి.కిషోర్ బదిలీపై రాయదుర్గం మున్సిపాలిటీకి వెళ్ళారు. తిరుపతిలో   సీనియర్ ఆడిటర్ గా విధులు నిర్వహిస్తున్న టి.సుధాకర్ రెడ్డి ని నందికొట్కూరు మున్సిపల్ కమిషనర్ గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.శుక్రవారం బాధ్యతలు చేపట్టిన ఆయన మున్సిపల్ చైర్మన్ దాసి సుధాకర్ రెడ్డి ని మర్యాద పూర్వకంగా కలిశారు.మున్సిపాలిటీ అభివృద్ధి కోసం కృషి చేయాలని చైర్మన్ కోరారు.అనంతరం నూతన కమిషనర్ కు మున్సిపల్ సిబ్బంది పుష్ప గుచ్చాలు అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు.

About Author