నగరపాలక కమీషనర్ ఆత్మహత్య !
1 min read
పల్లెవెలుగువెబ్ : కడపలో దారుణం జరిగింది. పుట్టపర్తి నగర పాలక సంస్థ కమిషనర్ మణికుమార్ ఆత్మహత్యకు పాల్పడ్డారు. కడప రైల్వేస్టేషన్ సమీపంలో రైలు కింద పడి ఆయన బలవన్మరణం పాలయ్యారు. గతంలో కడప నగర పాలక సంస్థ సూపరెండెంట్‌గా మణికుమార్ పని చేశారు. ఆత్మహత్యకు గల కారణాలపై రైల్వే పోలీసులు విచారిస్తున్నారు. మణికుమార్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కడప రిమ్స్‌కు రైల్వే పోలీసులు తరలించారు.