మున్సిపల్ ఉద్యోగ,కార్మికుల, సమస్యలు పరిష్కరించాలి
1 min read
ఎమ్మెల్యే బడేటి చంటి కి వినతిపత్రం అందజేత
ఏ.పి.మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఏలూరు జిల్లా కార్యదర్శి భజంత్రీ శ్రీనివాసరావు
పల్లెవెలుగు,ఏలూరు జిల్లా ప్రతినిధి: కూటమి ప్రభుత్వం మున్సిపల్ ఉద్యోగ, కార్మికుల సమస్యలను పరిష్కరించాలని ఏ.పి. మున్సిపల్ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ) ఏలూరు జిల్లా కార్యదర్శి భజంత్రీ శ్రీనివాసరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఏపీ మున్సిపల్ వర్కర్ స్ యూనియన్ రాష్ట్ర సమితి ఇచ్చిన పిలుపుమేరకు ఏలూరు నగర సమితి ఆధ్వర్యంలో స్థానిక శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్య (చంటి) కి సమస్యలతో కూడిన వినతి పత్రం అందజేశారు. అనంతరం భజంత్రీ శ్రీనివాసరావు మాట్లాడుతూకూటమి ప్రభుత్వం ఆప్కాస్ రద్దు పరుస్తూ రాష్ట్ర క్యాబినెట్ లో ఆమోదించినట్లు పత్రికల ద్వారా వార్తలు వస్తున్న నేపథ్యంలో కాంట్రాక్టు,ఔట్ సోర్సింగ్ ఉద్యోగకార్మికుల ను క్రమబద్ధీకరించి, ఉద్యోగ,వేతన భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. అపరిస్కృతంగా ఉన్న 3 సంవత్సరాల సరెండర్ లీవ్, ఎన్ కాష్మెంట్,3 డిఏలు తక్షణమే విడుదల చేయాలన్నారు. రాబోయే బడ్జెట్ సమావేశాలలో ఈ సమస్యల మీద అసెంబ్లీలో వివరించాలని శ్రీనివాసరావు కోరారు.ఈ కార్యక్రమంలో యూనియన్ నగర కోశాధికారి కసంకోట నాగేంద్ర,పుచ్చ శంకర్,మీసాల చంద్రమౌళి, గోవాడ మల్లేశ్వరరావు, కసింకోట రమణ,అల్లం పెద్దిరాజు, ధనియాల రాజేష్, తదితరులు పాల్గొన్నారు.