మున్సిపల్ కార్మికుల పనివేళలు మార్చాలి
1 min read
మున్సిపల్ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ)
ఎమ్మిగనూరు, న్యూస్ నేడు : పట్టణంలో పాత మున్సిపల్ కార్యాలయంలో ఏఐటీయూసీ ఎల్లప్ప వీరేషు తిమ్మ గురుడు మాట్లాడుతూ వేసవి ఉష్ణోగ్రతలు ఏప్రిల్ నుంచి జూన్ వరకూ తీవ్రంగా ఉంటాయని వాతావరణ పరిశోధన కేంద్రం ప్రకటించినందున మున్సిపల్ కార్మికుల పనివేళలను మార్చాలని ఎపి మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో బుధవారం పాత మున్సిపల్ కార్యాలయంలో నిరసన వ్యక్తం చేయడం జరిగిందనీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ (ఏఐటియుసి)ఉపాధ్యక్షుడు ఎల్లప్ప,తాలూకా అధ్యక్ష కార్యదర్శులు వీరేష్, తిమ్ముగురుడు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మున్సిపల్ కార్మికులు పూర్తిగా మండుటెండలో పనిచేయాల్సి వస్తున్నందున, త్వరగా అలసట చెందడం, వడగాడ్పులకు గురయ్యే ప్రమాదం ఉందన్నారు. కార్మికుల పనివేళలను మార్చి వారి ఆరోగ్యాన్ని కాపాడేందుకు సత్వరమే చర్యలు చేపట్టాలన్నారు. ఉదయం 5:30 నుంచి 11:30 గంటల మధ్య మాత్రమే కార్మికులతో పని చేయించాలని, ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకుని మంచినీరు, మజ్జిగ,ఒఆర్ఎస్ ప్యాకెట్లు అందించాలని కోరారు. వడగాడ్పులకు గురైన కార్మికులకు ప్రభుత్వమే వైద్య సేవలు అందించాలని, వైద్య సేవలు అవసరమైన అన్ని రోజులు జీతంతో కూడిన సెలవు దినాలుగా పరిగణించాలన్నారు. కార్మికులకు వడదెబ్బ తగలకుండా టోపీలు, ఖద్దరు కండవాలు ఇవ్వాలని కోరారు. ప్రమాదవశాత్తు మరణించిన కార్మికుల కుటుంబాలకు రూ.10 లక్షల నష్టపరిహారం చెల్లించి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐటియుసి పట్టణ కార్యదర్శి విజయేంద్ర,మున్సిపల్ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ),శివ,సల్మాన్, నల్లారెడ్డి,వెంకట్రాముడు, రమాదేవి,సల్మాన్,ఈరన్న, చిన్నికేశన్న, గౌరమ్మ, సరస్వతి, రోగన్న, పృథ్వీరాజ్, చిన్న వెంకటరాముడు, నల్లన్న, తదితరులు పాల్గొన్నారు.