మున్నేరు వాగు.. ఐదుగురు చిన్నారుల మిస్సింగ్ !
1 min read
పల్లెవెలుగువెబ్ : విజయవాడ మున్నేరు వాగు వద్ద కలకలం రేగింది. ఐదుగురు చిన్నారులు కనబడకుండాపోయినట్టు తెలుస్తోంది. ఈ సాయంత్రం 4 గంటల సమయంలో మున్నేరు దగ్గరకు చిన్నారులు వెళ్లారు. చిన్నారులు ఇప్పటివరకూ కనిపించకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. మున్నేరులో గల్లంతయ్యారా? లేక అవతలి ఒడ్డుకు వెళ్లారా అనే దానిపై అనుమానం వ్యక్తమవుతోంది. మున్నేరు ఒడ్డునే పిల్లలకు సంబంధించిన సైకిల్, బట్టలను స్థానికులు గుర్తించారు. చందర్లపాడు మండలం ఏటూరు దగ్గర ఘటన జరిగింది. విషయం తెలుసుకున్న పోలీసులు మున్నేరు వాగు వద్ద గాలిస్తున్నారు.