NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

బాలిక పై హ‌త్యాచారం కేసు.. నిందితుడు రాజు ఆత్మహ‌త్య

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్ : సైదాబాద్ లో ఆరేళ్ల బాలిక పై హ‌త్యాచారం చేసిన నిందితుడు రాజు ఆత్మహ‌త్య చేసుకున్నాడు. స్టేష‌న్ ఘ‌న్ పూర్ స‌మీపంలో నాష్కల్ రైల్వే ట్రాక్ పై రాజు మృత‌దేహాన్ని గుర్తించారు. చేతి పై ప‌చ్చబొట్టు ఆధారంగా నిందితుడిని నిర్ధారించారు. రాజు మృతిని డీజీపీ మ‌హేంద‌ర్ రెడ్డి ధృవీక‌రించారు. స్టేష‌న్ ఘ‌న్ పూర్ వ‌ద్ద నిందితుడి శ‌రీరం పై ఉన్న గుర్తుల నిర్ధారించిన‌ట్టు ఆయ‌న తెలిపారు. ఈనెల 9న సైదాబాద్ లో ఆరేళ్ల బాలిక పై అత్యాచారం జ‌రిగింది. ఘ‌ట‌న త‌ర్వాత నిందితుడు రాజు క‌నిపించ‌కుండా పోయాడు. ప‌రారీలో ఉన్న రాజు కోసం పోలీసుల తీవ్రంగా గాలించారు. 10 ల‌క్షల రివార్డు కూడ ప్రక‌టించారు. నిందితుడి గాలింపు కొన‌సాగుతుండ‌గానే స్టేష‌న్ ఘ‌న్ పూర్ వ‌ద్ద మృత‌దేహాన్ని గుర్తించారు.

About Author