జవాన్ల పై హత్యానేరం కేసు !
1 min readపల్లెవెలుగువెబ్ : విచక్షణా రహితంగా కాల్పులు జరిపి సామాన్య పౌరుల మరణానికి కారణమయ్యారని ఆరోపిస్తూ 30 మంది సైనికులపై నాగాలాండ్ పోలీసులు అభియోగపత్రం దాఖలు చేశారు. 2021 డిసెంబరు నాలుగున మోన్ జిల్లా ఒటింగ్-టురు ప్రాంతంలో 21 పారా స్పెషల్ ఫోర్సు పోలీసులు జరిపిన కాల్పుల్లో 13 మంది మరణించారు. దాంతో జవాన్లపై హత్యాయత్నం కేసులు మోపి కోర్టులో ఛార్జిషీట్ సమర్పించారు. గస్తీ సమయంలో అనుసరించాల్సిన నియమనిబంధనలను పాటించకుండా ఇష్టం వచ్చినట్టు కాల్పులు జరిపినట్టు దర్యాప్తులో తేలింది. అన్ని అంశాలపై శాస్త్రీయంగా దర్యాప్తు జరిపి చార్జిషీట్ రూపొందించినట్టు డీజీపీ టి.జాన్‌లాంగ్ కుమెర్ చెప్పారు. మేజర్, ఇద్దరు సుబేదార్లు, ఎనిమిది మంది హవల్దార్లు, నలుగురు నాయక్‌లు, ఆరుగురు లాన్స్ నాయక్‌లు, తొమ్మిది మంది పారాట్రూపర్లపై కేసులు పెట్టినట్టు వివరించారు.