హత్య కేసు… బీజేపీ నేత అరెస్ట్
1 min readపల్లెవెలుగువెబ్ : యువతి హత్య కేసులో ప్రధాన నిందితుడైన ఉత్తరాఖండ్ బీజేపీ నేత కుమారుడు పుల్కిత్ ఆర్యను పోలీసులు అరెస్ట్ చేశారు. రిషికేష్ లక్ష్మణ్ ఝులా ప్రాంతంలోని పుల్కిత్ రిసార్ట్లో రిసెప్షనిస్టుగా పనిచేస్తున్న 19 ఏళ్ల యువతి హత్యకు గురైంది. ఈ నెల 18న యువతి అదృశ్యమైంది. ఆ రోజు రాత్రి 8 గంటల సమయంలో పుల్కిత్ ఆర్య, రిసార్ట్ మేనేజర్ సౌరభ్ భాస్కర్, అంకిత్ అలియాస్ పుల్కిత్ గుప్తాతో కలిసి రిషికేష్ వెళ్లినట్టు పోలీసులు పేర్కొన్నారు. తిరిగి వస్తుండగా చిలా రోడ్డులోని కెనాల్ వద్ద మద్యం తాగేందుకు ఆగారు. వారు మద్యం తాగుంటే యువతి వారి కోసం వేచి చూసింది. ఆ తర్వాత యువతికి, వారికి మధ్య గొడవ మొదలైంది. రిసార్టులో వీరు అసాంఘిక కార్యకలాపాలు నిర్వహిస్తున్నారని, ఈ విషయాన్ని బయటపెడతానని ఆమె బెదిరించింది. దీంతో కోపంతో ఊగిపోయిన నిందితులు ఆమెను కెనాల్లోకి తోసేశారు.