ముషార్రఫ్ పరిస్థితి విషమం !
1 min read
పల్లెవెలుగువెబ్ : పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు జనరల్ పర్వేజ్ ముషార్రఫ్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లోని ఆస్పత్రిలో ఆయన మూడు వారాలుగా చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం ఆయన చాలా క్లిష్లమైన స్థితిలో ఉన్నారని, కోలుకునే అవకాశాలు లేవని ఆయన కుటుంబ సభ్యులు ట్విటర్‌లో ప్రకటించారు. ‘‘అమైలాయ్‌డోసిస్‌కు చికిత్స పొందుతున్నారు. ఆయన అవయవాలు సరిగా పనిచేయడం లేదు. ఆయన ఆరోగ్యం మెరుగవ్వాలని ప్రార్థిస్తున్నాం’’ అని వారు పేర్కొన్నారు.