PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

వైసీపీ ప్రభుత్వంలోనే ముస్లిం మైనారిటీలకు పెద్దపీట

1 min read

ముస్లిం మైనారిటీలను మోసం చేసిన వ్యక్తి చంద్రబాబు

పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: రాష్ట్రంలోని ముస్లింలకు రాజకీయ, ఆర్థిక, సామాజికపరంగా స్థాయిని, గుర్తింపును కల్పిస్తూ వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని వైసీపీ మైనార్టీ సెల్ ఉమ్మడి జిల్లాల జోనల్ ఇంచార్జి అబూ బక్కర్ అన్నారు. శాప్ చైర్మన్  బైరెడ్డి సిద్ధార్థ రెడ్డ ఆదేశాల మేరకు శనివారంనందికొట్కూరు పట్టణంలోని ప్యారడైజ్ ఫంక్షన్ హాలు నందు మైనారిటీ సెల్ ఉమ్మడి జిల్లాల జోనల్ ఇంఛార్జి అబూబక్కర్  ఆధ్వర్యంలో “హర్ దిల్ మే వైయస్ఆర్ – హమ్ సబ్ జగన్ కే సాత్” కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నందికొట్కూరు నియోజకవర్గ సమన్వయకర్త, ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ దార సుధీర్, మున్సిపల్ చైర్మన్  దాసి సుధాకర్ రెడ్డి, పట్టణ అధ్యక్షులు మన్సూర్ , మాజీ కో ఆప్షన్ సభ్యులు  అబ్దుల్ జబ్బార్,వైసీపీ జిల్లా కమిటీ సభ్యులు ఉస్మాన్ బేగ్ హాజరయ్యారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వం  హయాంలో ముస్లిం మైనారిటీలకు ఒరిగేదేమీ లేదని ముస్లిం మైనారిటీలను మోసం చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు అన్నారు.ముస్లిం మైనారిటీల హక్కుల కోసం ప్రశ్నించిన ముస్లిం మైనారిటీ నిరుద్యోగులపై దేశద్రోహులుగా కేసులు పెట్టి జైలుకు పంపిన దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు అని అన్నారు.చంద్రబాబు ఏనాడు ముస్లిం మైనారిటీలను మనుషులుగా గుర్తించ లేదని విమర్శించారు.  మైనారిటీలను సీఎం జగన్‌మోహన్‌రెడ్డి,  గుండెల్లో పెట్టుకుని చూసుకుంటు న్నారన్నారు. గతంలో ముస్లింలకు 4 ఎమ్మెల్యే సీట్లను కేటాయిస్తే  నేడు ఏకంగా 7 సీట్లు ఇవ్వడం అభినందనీయమన్నారు. చరిత్రలో ఎప్పుడూ లేనివిధంగా ఉపముఖ్యమంత్రి పదవితో పాటు కేబినెట్‌ హోదా కలిగిన 12 కార్పొరేషన్లు కేటాయించారన్నారు. మైనారిటీలకు ప్రభుత్వం అన్ని విధాలా మంచి చేసిందన్నారు. జగనన్న ప్రభుత్వంలో ఈ నాలుగున్నర సంవత్సరాల్లో మైనారిటీల సంక్షేమానికి ఏకంగా  రూ. 24వేల కోట్ల  ఖర్చు చేసిందని తెలిపారు.అదే విధంగా ఇమామ్ లు, మౌజమ్ లకు ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా ఏకంగా రూ.15000 వేల  గౌరవ వేతనం ఇచ్చిన ఘనత ఒక్క జగనన్నకే సాధ్యం అని అన్నారు.ముస్లిం మైనార్టీల పెళ్లిళ్లకు వైయస్ఆర్ షాదీ తోఫా రూ.1లక్ష  ఇవ్వడం జరుగుతుందని మసీదు లు మరమ్మతులు అలాగే నూతన మసీదు ల నిర్మాణాలకు ప్రత్యేక నిధుల కేటాయించడం సంతోషించదగ్గ విషయం అన్నారు. పట్టణ ముస్లిం మైనార్టీల కోసం స్మశాన వాటిక, అలాగే  ఉర్దూ స్కూల్ ఏర్పాటుకు కృషి చేయాలని చైర్మన్ సుధాకర్ రెడ్డి  ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ దార సుధీర్ ను మైనారిటీ సోదరుల తరపున కోరారు. ముస్లింలు సుభిక్షంగా, సంతోషంగా ఉండేందుకు వారి హక్కులను పూర్తిగా గౌరవించి, అత్యున్నతస్థాయికి తీసుకెళ్లేందుకు కృషిచేస్తున్నందుకు అందరూ సీఎం జగన్‌మోహన్‌రెడ్డికి అండగా నిలవాలన్నారు. రానున్న ఎన్నికల్లో మళ్లీ జగనన్నను ఆశీర్వదించాలన్నారు.అనంతరం ముస్లిం మైనారిటీ పెద్దలు డా.సుధీర్ ధారా , చైర్మన్ సుధాకర్ రెడ్డి లను సన్మానించారు.ఈ కార్యక్రమంలో ఖాజీ అబ్దుల్ రహిమాన్ మౌలానా, ఖాజీ జలాల్ మౌలానా, ఖాజీ ఇబ్రహీం మౌలానా, మౌలాన ఆసీఫ్, ఆయుబ్ మౌలానా, వైసిపి నాయకులు లాయర్ నజీర్ అహ్మద్, మహబూబ్ భాష, అబ్దుల్ సుకుర్, కొత్తపల్లి మండలం గౌస్, జూపాడుబంగ్లా మండల ఖాజావుద్దిన్ , కౌన్సిలర్ లు అబ్దుల్ హమీద్, అబ్దుల్ రవూఫ్, శాలి భాష ,నందికొట్కూరు నియోజకవర్గ పరిధిలోని ఆరు మండలాల  ముత్తవల్లీలు, మౌలానా , మోజోన్ల, హర్ దిల్ మే వైయస్సార్ , హమ్ సబ్ జగన్ కే సాథ్ ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమంలో పాల్గొన్నారు.

About Author